Jawad Cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న జవాద్ తుపాన్.. ప్రజలకు వార్నింగ్.. అలర్ట్ అయిన అధికారయంత్రాంగం..

Jawad Cyclone: ఏపీని వర్షాలు మాత్రం వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆ నష్టం నుండి ఇంకా కోలుకోకముందే మరో ముప్పు దూసుకొస్తోంది.

Jawad Cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న జవాద్ తుపాన్.. ప్రజలకు వార్నింగ్.. అలర్ట్ అయిన అధికారయంత్రాంగం..
Jawad
Follow us

|

Updated on: Dec 03, 2021 | 5:47 AM

Jawad Cyclone: ఏపీని వర్షాలు మాత్రం వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆ నష్టం నుండి ఇంకా కోలుకోకముందే మరో ముప్పు దూసుకొస్తోంది. జవాద్ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్నదని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర పై ఎక్కువడా ఉంటుందని వాతావరణశాఖ వార్నింగ్‌ నేపధ్యంలో ఏపీ అధికారులు అలెర్ట్‌ అయ్యారు.

వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి 960 కిలోమీటర్లు, గోపాలపూర్ కు 1,020 కిలోమీటర్లు, పారదీప్ కు 1,060 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శనివారం నాడు ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్లు, ఎల్లుండి ఉదయం నుంచి 70-90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఈ నేపథ్యంలో మత్య్యకారులు ఎవరు కూడా సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలాఉంటే.. ఉత్తరాంధ్ర తుపాను హెచ్చరికల దృష్ట్యా జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అవసరమైన అన్ని చోట్ల సహాయక శిబిరాలు నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేయాలని. లోతట్టు ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను ముందే అప్రమత్తం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచనలు చేశారు.

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్