JC Divakar Reddy: ‘నీకు ఏమికాదమ్మ..’ అంటూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించిన జేసీ.. కానీ..

ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అందులో ప్రయాణించే ఒక యువతి తీవ్ర అపస్మారక స్థితిలోకి జారుకుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాడిపత్రి నుంచి వస్తున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..

JC Divakar Reddy: ‘నీకు ఏమికాదమ్మ..’ అంటూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించిన జేసీ.. కానీ..
Jc Diwakar Reddy

Updated on: Mar 31, 2022 | 12:05 PM

ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది(Accident). అందులో ప్రయాణించే ఒక మహిళ తీవ్ర అపస్మారక స్థితిలోకి జారుకుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాడిపత్రి నుంచి వస్తున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి(JC Divakar Reddy) ఈ ఘటనను చూశారు. వెంటనే స్పందించారు. ప్రమాద సంఘటన స్థలి వద్ద కారు ఆపారు. ‘నీకు ఏమికాదమ్మ..’ అంటూ గాయపడ్డ మహిళకి జేసీ దివాకర్ రెడ్డి ధైర్యం చెప్పారు. వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నవారని నిలువరించి.. ఇది వివరాలు తెలుసుకోవడానికి సమయం కాదని.. గాయపడిన మహిళకి చికిత్స అందించాలన్నారు. తన కారులో ఎక్కించుకొని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ప్రభుత్వ వైద్యులను గాయపడిన మహిళకు అత్యవసర చికిత్స అందించాల్సిందిగా కోరారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడుని ఆస్పత్రి వద్దకు పిలిపించి వ్యక్తిగత పర్యవేక్షణ తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

అయితే ఆమె పట్ల విధి చిన్నచూపు చూసింది.. మహిళ ప్రాణాలు కాపాండేందుకు జేసి దివాకర్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆ మహిళ కన్నుమూసింది. ఆమెను బతికించాలనే ప్రయత్నం లో భాగంగా జేసీ దివాకర్ రెడ్డి తన వాహనాన్ని వేగంగా ఆస్పత్రికి తీసుకు వెళ్లినా చికిత్స పొందుతూ మరణించడం విషాదం నెలకొంది. దీంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. జేసీ దివాకర్ రెడ్డి మానవత్వంతో వెంటనే స్పందించి ఆ మహిళను ఆసుపత్రికి తీసుకు రావడంపై బిగ్ పొలిటిషియన్ గ్రేట్ జాబ్ అంటూ స్థానికుల నుంచి స్పందన వస్తోంది. మృతురాలిది బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. మానవత్వం చూపిన జేసి దివాకర్ రెడ్డి ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..

Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. కన్నడ భక్తుడిపై హోటల్ యజమాని దాడి.. ఘర్షణ..

 

Loading...
Unable to load recommendations.
Follow Us