ISRO Satellites: ఇస్రో ప్రయోగం సక్సెస్‌ .. నింగిలోకి దూసుకెళ్లిన మూడు ఉపగ్రహాలు

|

Feb 10, 2023 | 9:40 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగం సక్సెస్‌ అయింది. శుక్రవారం ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ తెల్లవారుజామున..

ISRO Satellites: ఇస్రో ప్రయోగం సక్సెస్‌ .. నింగిలోకి దూసుకెళ్లిన మూడు ఉపగ్రహాలు
Isro Satellites
Follow us on

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగం సక్సెస్‌ అయింది. శుక్రవారం ఉదయం 9.18 నిమిషాలకు SSLV D2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైన ఈ ప్రయోగం విజయవంతం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. 156.3 కిలోల బరువున్న ఈవోఎస్‌-07, 8.7 కిలోల బరువున్న ఆజాదీశాట్‌-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్‌-01 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతంతో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించిన దేశంగా ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది.  తిరుపతి జిల్లా శ్రీహరి కోట నుంచి చేపట్టిన ఈ ప్రయోగం మొత్తం 13 నిమిషాల 2 సెకన్లలో పూర్తయింది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన EOS 07 ఉపగ్రహంతో పాటు మరో రెండు నానో ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. మార్చి నెలలో LVM..3 రాకెట్ ప్రయోగం ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు సిద్ధమవుతున్నారు శాస్త్రవేత్తలు. ఏప్రిల్ నెలలో మరో SSLVతో పాటు మే నెలలో గగన్ యాన్ ప్రయోగాత్మక లాంచ్ ఉండబోతున్నట్టు ఇస్రో తెలిపింది.

ఈ ప్రయోగం విజయవంతమయినట్లయితే ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్ లో భారత్ దూసుకుపోతుంది. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశాలుకు సంబంధించిన చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సాధిస్తుంది.

షార్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తల సంబరాలు

ఇస్రో ప్రయోగించిన మూడు ఉపగ్రహాలు నింగిలోకి వెళ్లి విజయవంతం కావడంతో షార్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. భారత్‌కు చెందిన 2 ఉప గ్రహాలు, అమెరికాకు చెందిన 1 ఉప గ్రహం కక్ష్యలోకి చేరుకుని విజయవంతం అయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి