Viral Video: అయ్యో నా కోడి అప్పుడే విడిచెల్లావా!.. ఎక్కిఎక్కి ఏడ్చిన వ్యక్తి..!

Viral Video: సాధారణంగానే మనుషులకు, మూగ జీవాలకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా సాదు జంతువులతో..

Viral Video: అయ్యో నా కోడి అప్పుడే విడిచెల్లావా!.. ఎక్కిఎక్కి ఏడ్చిన వ్యక్తి..!
Cock Died

Updated on: Feb 09, 2022 | 4:07 PM

Viral Video: సాధారణంగానే మనుషులకు, మూగ జీవాలకు మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా సాదు జంతువులతో చాలా మంది ఎంతో ప్రేమంగా ఉంటారు. తమ ఇంట్లో పెంచుకునే కుక్క, పిల్లి, కోడి, ఇలా ప్రతీ దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. వాటికి ఏమైనా అయితే తట్టుకోలేనంత స్థితిలో ఉంటారు. ఇలాంటి ఘటనలు మనం కోకొల్లలుగా చూసే ఉన్నాం. తాము ఎంతో అపురూపంగా పెంచుకున్న సాధు జీవులు కనపడకపోయినా.. అవి చనిపోయినా బోరున విలపిస్తుంటారు. ఇంకొందరైతే.. కొద్దిరోజులు అన్నం తినడం కూడా మానేసిన ఘటనలు ఉన్నాయి. పలు సందర్భాల్లో జంతువులు కూడా మనుషుల్లాగే రియాక్ట్ అవుతుంటాయి. తమ ప్రియమైన యజమాని కనిపించకపోయినా.. వారి చనిపోయినా వారి తీవ్ర విచారంతో ఉంటాయి. పెంపుడు కుక్కలు తమ యజమాని చనిపోతే.. వారి సమాధుల వద్ద రోజుల తరబడి వేచి ఉన్న ఘటనలు కూడా మనం చూశాం.

అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కోడి చనిపోయిందన్న బాధలో ఎక్కిఎక్కి ఏడ్చాడు ఆ కోడి యజమాని. నాలుగేళ్లుగా పెంచుకున్న కోడి మృతి చెందడంతో.. అయ్యో నా తల్లి చనిపోయావా అంటూ పడిపడి ఏడ్చాడు. ఇక ఆ వ్యక్తి ఏడ్పును ఆపలేక తంటాలు పడ్డారు స్థానికులు. అంతేకాదు.. కోడిని తన ఇంటి ముందే పూడ్చి పెట్టాడు ఆ వ్యక్తి. ఈ ఘటన అనంతపురం జిల్లా నార్పలలోని ఉయ్యాలకుంటలో జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియోను మీరూ చూసేయండి.

Also read:

ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసేవారికి గుడ్‏న్యూస్.. అందులో ప్రోఫైల్ క్రియేట్ చేస్తే ఛాన్స్ మీ వద్దకే.!!

సలలిత రాగసుధారసాన్ని పంచిన సుస్వరాల సుసర్ల.. లతాను తెలుగువారికి పరిచయం చేసింది ఆయనే!

SEBI Officer Grade A 2022: ఫిబ్రవరి 20న జరగనున్న సెబీ 2022 గ్రేడ్‌ ఏ పరీక్షకు హాల్‌ టికెట్లు విడుదల..