Family Clashes: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ.. అర్థరాత్రి వేళ అతని భార్య ఏం చేసిందంటే..

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో ఓ ఆర్ఎంపీ అరాచకం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ.. తన భార్యను తీవ్ర వేధింపులకు గురి చేశాడు.

Family Clashes: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ.. అర్థరాత్రి వేళ అతని భార్య ఏం చేసిందంటే..
Harassment

Updated on: Jan 08, 2022 | 7:53 AM

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో ఓ ఆర్ఎంపీ అరాచకం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ.. తన భార్యను తీవ్ర వేధింపులకు గురి చేశాడు. భర్త వేధింపులు తట్టుకుకోలేకపోయిన అతని భార్య.. అర్థరాత్రి వేళ గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వాట్సప్ మెసేజ్ ద్వారా తాను ఎదుర్కొంటున్న దుస్థితిని ఎస్పీకి వివరించింది. వివరాల్లోకెళితే.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో ఆర్ఎంపీ రామారావు కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, రామారావు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆ మోజులో కట్టుకున్న భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇలా కొంతకాలంగా భార్య తవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇటీవలి కాలంలో ఆ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. ఇక భర్త వేధింపులు తాళలేకపోయిన ఆ మహిళ.. అర్థరాత్రి వేళ గుంటూరు రూరల్ ఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదులు చూసిన ఎస్పీ.. వెంటనే తుళ్లూరు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్పీ ఆదేశాలతో అలర్ట్ అయిన పోలీసులు.. భార్యను వేధింపులకు గురి చేస్తున్న ఆర్ఎంపీ రామారావుపై కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా ఒంగోలుకు చెందిన మహిళతో రామారావు వివాహేతర సంబంధం పెట్టుకొని వేధిస్తున్నాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. తన భర్త నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

Also read:

Sugar Craving: ఎల్లప్పుడూ తీపి తినాలనిపిస్తుందా..? అయితే ప్రమాదమే.. ఏం చేయాలో తెలుసుకోండి

The American Dream: ఆహా అందించనున్న మరో ఆసక్తికర మూవీ.. ఆకట్టుకుంటున్న ది అమెరికన్ డ్రీమ్ ట్రైలర్..

Viral news: 40 వసంతాల ప్రేమ.. ఇప్పుడు పెళ్లిపీటలెక్కింది.. పెళ్లి కుమారుడు ఎవరో తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం..