Andhra: ఏంటి మామ ఇలా ఉన్నారు.. భార్యను హత్య చేసిన భర్త, లవర్.. అసలు కథ తెలిస్తే..

పల్నాడు జిల్లా ఉప్పలపాడులో భార్య మల్లేశ్వరి హత్య కేసు సంచలనం రేపింది. ఆమె భర్త ఈశ్వరయ్య, ప్రియుడు నాగేశ్వరరావులు కలిసి మల్లేశ్వరిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మల్లేశ్వరి మూడో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఈశ్వరయ్య, నాగేశ్వరరావు ఆగ్రహంతో రాత్రి మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. ఘర్షణలో మల్లేశ్వరి తలపై కొట్టి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Andhra: ఏంటి మామ ఇలా ఉన్నారు.. భార్యను హత్య చేసిన భర్త, లవర్.. అసలు కథ తెలిస్తే..
Palnadu Crime News

Edited By:

Updated on: Mar 02, 2026 | 11:51 AM

ఓ మహిళను.. ఆమె భర్త.. ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు.. ఈ ఘటనతో పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఉప్పలపాడులో 26వ తేదీన కలకలం రేగింది. గ్రామంలోని ఒక రేకుల షెడ్డులో నలభై నాలుగేళ్ల మహిళ చనిపోయి ఉంది. ఆమె మృతదేహాన్ని పరిశీలించిన స్థానికులు హత్యగా భావించారు. అయితే, కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. ఆమె భర్త, ప్రియుడు కలిసే హత్య చేసినట్లు.. గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఉప్పలపాడుకు చెందిన వేల్పుల ఈశ్వరయ్య, మల్లేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వీరికి వివాహం కావడంతో గ్రామం బయటే నివసిస్తున్నారు. అయితే మల్లేశ్వరి గత కొంతకాలంగా గ్రామానికే చెందిన వేల్పులు నాగేశ్వరరావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లతో పాటు భర్త ఈశ్వరయ్యకు కూడా తెలుసు… నాగేశ్వరరావు.. మల్లేశ్వరి కుటుంబాన్ని కూడా పోషిస్తుండటంతో వివాహేతర సంబంధం గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ మధ్య కాలంలో మల్లేశ్వరి మరొక వ్యక్తితో చనువుగా ఉంటున్నట్లు గుర్తించారు. ఈ నెల 25వ తేదిన రాత్రి సమయంలో మల్లేశ్వరి ఆలస్యంగా ఇంటికొచ్చింది. ఆమె ఇంటికొచ్చే సమయానికి ఈశ్వరయ్య, నాగేశ్వరరావులు మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లేశ్వరి ప్రవర్తన చర్చకు వచ్చింది.

అదే సమయంలో మల్లేశ్వరి ఇంటికి రావడంతో ఆమెను ప్రశ్నించారు. ఆమెతో ఈశ్వరయ్య, నాగేశ్వరరావులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలోనే ఇద్దరి కలిసి మల్లేశ్వరి తలపై కొట్టారు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను సమీపంలో ఉన్న రేకుల షెడ్డులోకి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

తెల్లవారే సరికి మల్లేశ్వరి హత్య గ్రామంలో కలకలం రేపింది. ఎవరూ హత్య చేసి ఉంటారు..? అన్న దానిపై మొదట్లో స్పష్టత రాలేదు. అయితే పోలీసులు ముందుగా ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో మొత్తం చెప్పేశాడు. ఈశ్వరయ్య, నాగేశ్వరరావులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు పంపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us