Kurnool district: మిరప చేనులో నక్కిన భారీ కొండచిలువ.. రైతు పొలానికి వెళ్లగానే

ఇటీవల భారీ కొండచిలువలు, ప్రమాదకర విషసర్పాలు తరచూ జనావాసాల్లో చేరి ప్రజల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. 

Kurnool district: మిరప చేనులో నక్కిన భారీ కొండచిలువ.. రైతు పొలానికి వెళ్లగానే
Python

Updated on: Dec 09, 2021 | 2:52 PM

ఇటీవల భారీ కొండచిలువలు, ప్రమాదకర విషసర్పాలు తరచూ జనావాసాల్లో చేరి ప్రజల్ని పరుగులు పెట్టిస్తున్నాయి.  కొన్ని కొన్ని సందర్బాల్లో కొంతమంది పాముకాటుతో ప్రాణాలు కొల్పోయిన ఘటనలు కూడా చూస్తున్నాం. అయితే, తాజాగా ఓ మిర్చి తోటలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కర్నూలు జిల్లా గోస్పాడు మండలంలో భారీ కొండచిలువ హల్‌చల్‌ చేసింది. పట్టె నిండా భారీ ఆకారాన్ని చూసిన రైతు.. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూశాడు. భారీ కొండ చిలువ అని నిర్ధారించుకుని రైతు, కూలీలు భయంతో పరుగులు తీశారు.

గోస్పాడు మండలం పసురపాడు గ్రామ పొలాల్లో ఈ భారీ కొండచిలువ కలకలం రేపింది. కొండచిలువ సంచారంపై స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీ అధికారులు చాకచక్యంగా కొండచిలువను బంధించారు.  ఆపై దాన్ని మహానంది సమీప అడవిలో వదిలేశారు. 10 అడుగుల మించి పొడవున్న కొండచిలువను చూసి అంతా షాక్‌ అయ్యారు. పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విషసర్పాలు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పాము కనపడగానే ఎగబడి చంపకుండా.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

 

Also Read: “ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు?” అడిగిన వధువు.. వరుడి ఆన్సర్ వింటే షాకే