Andhra: ఆయ్.! గోదావరిలో పసుపు రంగు పీతలు దొరికేశాయ్.. రేటు ఎంతో తెలుసా..?

పీతలు.. బాబోయ్.. పీతలు.. ఇక్కడ గంపెడంత పీతలు.. అన్ని రకాలు దొరుకుతాయి. రెండు కేజీల పీత రూ. ౩50 పలుకుతుంది. మరి ఆ ప్లేస్ ఏంటి.? ఎక్కడో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి ఇక్కడ.

Andhra: ఆయ్.! గోదావరిలో పసుపు రంగు పీతలు దొరికేశాయ్.. రేటు ఎంతో తెలుసా..?
Telugu News

Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2025 | 1:32 PM

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పీతలకు పెట్టింది పేరు. కోరంగి పంచాయతీ పెద్దవలసల గ్రామస్థులు పీతలు వేటాడుతూ జీవనం సాగిస్తారు. చిన బొడ్డు వెంకటాయపాలెంకు చెందిన సంగాడి కామేశ్వరరావుకు సముద్రంలో రెండు కేజీల పసుపు రంగు పీత చిక్కింది. దీనిని ఒక వ్యక్తి నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేసాడు.పెదవలసల గ్రామంలో 400 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 90 శాతం మందికి పీతల వేట జీవనాధారం. వీరు గుడ్డు, మగ, ఆడ, కన్నె రకాల పీతలు వేటాడేడప్పుడు దొరుకుతాయి. సాధారణంగా ఈ పీతల బరువు 100 గ్రాముల నుంచి 190 గ్రాములు ఉంటుంది. కేజీ ధర రూ. 250 ఉంటుంది. 2 కేజీల పీత ధర రూ. 350 పలుకుతుంది.

ఇక్కడి నుంచే మూడు జిల్లాలకు అమ్మకాలు..

పీతల అమ్మకానికి పెదవలసలలో ప్రత్యేక మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల చేపల మార్కెట్లలో పీతలు విక్రయించేందుకు మహిళలు తీసుకెళ్తారు. భారీ మొత్తంలో కాకినాడ పోర్టుకు అక్కడి నుంచి కలకత్తా, చైనాకు తరలిస్తారు. ఒక్కో మత్స్యకారుడు రోజుకు 500-900 రూపాయలు సంపాదిస్తారు. ఒక పడవపై పది మంది వరకు వెళ్తారు.