నెల రోజులైనా కానరాని వాన.. సూపర్ ఎల్‌నినో కోరలు చాచిందా..? తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం

తెలుగు రాష్ట్రాలను వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారాలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి నారుమళ్లు ముదిరిపోతుండగా, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి పంటలు మొలకెత్తక మట్టిలోనే మాడిపోతున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.

నెల రోజులైనా కానరాని వాన.. సూపర్ ఎల్‌నినో కోరలు చాచిందా..? తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
El Nino Effect

Updated on: Jul 08, 2026 | 9:50 PM

రెండేళ్ల కిందటి సంగతి. ఇక్కడ బియ్యం ఎగుమతులపై మోదీ సర్కార్‌ నిషేధం విధిస్తే, అక్కడ అమెరికాలో పానిక్ మొదలైంది. సూపర్‌మార్కెట్ల దగ్గర తొక్కిసలాట జరిగినంత పనయ్యింది. డజనుకుపైగా దేశాల్లో దాదాపు ఆహార సంక్షోభం ఏర్పడింది. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే మొత్తం బియ్యంలో 40 శాతానికిపైగా ఇండియావే. అటు, లార్జెస్ట్ వీట్ ప్రొడక్షన్ కంట్రీల్లో ముందువరసలో నిలబడేది కూడా హమారా భారతే. మన రైతు కనుక కాస్త వెనక్కి తగ్గితే, రోటీ తినిబతికే దేశాలన్నీ గోధుమ గింజకు నోచుకోక నకనకలాడిపోతాయ్. అందుకే, ప్రపంచానికే ధాన్య భాండాగారం అనే పేరుంది మన దేశానికి. అటువంటి అన్నపూర్ణమ్మకే కడుపు కాలితే.. మన రైతు కరువు కోరల్లో చిక్కితే…! అదే జరగబోతోంది మన దేశంలో. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్ని ఉడుకెత్తిస్తోంది వర్షాభావ పరిస్థితి. మనమున్నది వ్యవసాయాధారిత దేశంలో. ప్రకృతిని దేవతలతో సమానంగా భావించి పూజించే దేశంలో. కానీ, ఆ ప్రకృతి మాతే శాపం పెట్టే సైతాన్‌లా మారితే..? కరవు కాటకాల్ని కానుకలుగా ఇవ్వజూపితే..! నిన్నమొన్నటిదాకా మండే ఎండలని భరించి, భానుడి ఉగ్రరూపాన్ని తట్టుకున్నాం. ఎలాగోలా రోహిణి కార్తెని దాటి, మృగశిరలోకి ఎంట్రీ ఇచ్చేశాం. ఇప్పుడు కురిసే తొలకరికి పులకించిపోతాడు రైతు. మృగశిర కార్తెలో వచ్చే ఏరువాక పౌర్ణమిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఈ ఏడాది...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి