Samantha: కడపలో సమంత.. వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్.. నెక్ట్స్ లెవల్

ఓ షోరూం ప్రారంభోత్సవానికిగానూ హీరోయిన సమంత ఏపీలోని కడప వచ్చారు. ఆమె వస్తున్న విషయం తెలియడంతో.. జనం వేలాదిగా తరలివచ్చారు.

Samantha: కడపలో సమంత.. వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్.. నెక్ట్స్ లెవల్
Samantha

Updated on: Dec 12, 2021 | 4:02 PM

కడపలో మాంగళ్య షాపింగ్ మాల్ 11 వ షోరూమ్ ప్రారంభమైంది. కొత్త బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‍‌ను హీరోయిన్ సమంత, డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మంగళవాయిద్యాలు, నృత్యాలతో సమంతకు స్వాగతం పలికారు. సమంతను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వేలాదిగా అక్కడికి తరలివచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి క్రౌడ్‌ను కంట్రోల్ చేశారు.  ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని, 10 సంవత్సరాల తరువాత మీ ముందుకు రావడం మరీ సంతోషంగా ఉందన్నారు సమంత. ఈ మాంగళ్య షాపింగ్ మాల్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు సమంత.

తమ షాపింగ్ మాల్ లో తక్కువ ధరకు మంచి నాణ్యమైన చీరలు అందుబాటులో ఉన్నాయని, కడప ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు షాపింగ్ మాల్ వ్యవస్థాపకుడు కాశం నమశివాయ. కడప లాంటి నగరంలో ఇలాంటి షాపింగ్ మాల్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.

Also Read: 100 కోట్ల ‘అఖండ’.. కలెక్షన్లతో సింహగర్జన చేస్తోన్న బాలయ్య.. షేకయిన బాక్సాఫీస్

మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదం

Follow Us