AP Rains: గడిచిన పదేళ్ళలో ఎప్పుడూ లేనంత వాన, ఏపీ వ్యాప్తంగా కుండపోత.. బయటకు రావొద్దని ఆదేశాలు

|

Jul 18, 2021 | 10:11 AM

గడిచిన పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కుండపోత వాన కురిసింది. దీంతో వాగులు, వంకలు.. పొంగిపొర్లుతున్నాయి. పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి.

AP Rains: గడిచిన పదేళ్ళలో ఎప్పుడూ లేనంత వాన,  ఏపీ వ్యాప్తంగా కుండపోత.. బయటకు రావొద్దని ఆదేశాలు
Ap Rains
Follow us on

Heavy rains in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం పూట కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గడిచిన పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కుండపోత వాన కురిసింది. దీంతో వాగులు, వంకలు.. పొంగిపొర్లుతున్నాయి. పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి.

వలిసాబ్ రోడ్, కంచుకోట, మశానం పేట, నిజాంవలి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు పూర్తిగా నీటమునిగిపోయాయి.  అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల ఆదేశాలు జారీచేశారు.

అటు, కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో చెరువులు, కుంటలకు ప్రమాద స్థాయిలో నీరు చేరింది. ఎగువన కురిసిన భారీ వర్షానికి పుట్టపర్తిలో ఉధృతంగా చిత్రావతి నది ప్రవహిస్తోంది. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ శాఖ హెచ్చరించింది.

కర్నూలు జిల్లాలోనూ వానలు దంచికొడుతున్నాయి. మహానంది మండలంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిస్తోంది. దీంతో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గాజులపల్లె, మహానంది మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Flood Water

Read also: Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి