మాయమవుతున్న మిర్చి బస్తాలు.. అనుమానంతో ఫిర్యాదు చేస్తే.. చిన్న కథ కాదు ఇది..

మిర్చి ధరలు భారీగా పెరగడంతో గుంటూరులో మిర్చి బస్తాల దొంగతనాలు పెరుగుతున్నాయి. గురజాల నుంచి తీసుకొచ్చిన మిర్చి బస్తాలు చోరీకి గురవడంతో వ్యాపారి ఫిర్యాదు చేయగా, సాంకేతిక ఆధారాలతో నగరంపాలెం పోలీసులు 10 మంది సభ్యులతో కూడిన ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, వాహనాలు, మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

మాయమవుతున్న మిర్చి బస్తాలు.. అనుమానంతో ఫిర్యాదు చేస్తే.. చిన్న కథ కాదు ఇది..
Chilli Bags Vanish In Guntur

Edited By:

Updated on: Aug 05, 2026 | 1:08 PM

మిర్చి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు అధికంగా ఉండటంతో మిర్చి బస్తాలకు భద్రత లేకుండా పోయింది. క్వింటా ఇరవై ఐదు వేల రూపాయల ధర పలుకుంది. దీంతో ఒక్కొ మిర్చి బస్తా సుమారు పన్నెండు నుండి పదిహేను వేల రూపాయల ధర ఉంటుంది. ఈ క్రమంలోనే మిర్చిని తరలిస్తున్న సమయంలో ప్ర్యతేక దృష్టి పెట్టిన దొంగల ముఠా వాటిని అపహరించుకుపోతుంది. గత నెల 30వ తేదిన నల్లపాడుకు చెందిన శంకరరావు అనే వ్యాపారి గురజాలలో మిర్చి కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన మిర్చి బస్తాలను ట్రాక్టర్ లో గుంటూరు మిర్చి యార్డు వద్దకు తరలించాడు. అక్కడ ట్రాక్టర్ నిలిపి డ్రైవర్ నిద్ర పోతున్న సమయంలో మిర్చి బస్తాలు చోరికి గురయ్యాయి. దీనిపై వ్యాపారి శంకరరావు నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన నగరంపాలెం పోలీసులు సాంకేతిక ఆధారాలతో పది మంది సభ్యులను అరెస్ట్ చేశారు. క్రిష్ణబాబు కాలనీకి చెందిన దుర్గారావు, మరియదాసు, ఆనందరావు, నరసింహారావు, లక్ష్మీ నారాయణలను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి లక్ష నగదు, మూడు టాటా వాహనాలు, టూ వీలర్, పది మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా మిర్చి మార్కెట్ యార్డులో ముఠా కూలీలుగా పనిచేస్తూ యార్డుకు వచ్చే వాహనాలను సమాచారం ముందుగానే తెలుసుకుంటారు.

అయితే.. డ్రైవర్ భోజనానికి వెళ్లిన సమయంలోనో, నిద్ర పోతున్నప్పుడో గుట్టు చప్పుడు కాకుండా మిర్చి బస్తాలను దొంగలిస్తారు. ప్రయాణిస్తున్న వాహనం వెనుకనుండి బస్తాలు దొంగలించడంలో వీరు సిద్దహస్తులు. దొంగలించిన బస్తాలను అమ్ముకొని మినీ లారీలు, ఆటోలు, కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గత కొంతకాలంగా చోరీలు చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పది మంది ముఠాకు నాయకుడైన ఆకుల గణేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us