
విశాఖపట్నం – కొల్లాం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18501 / 18502) :18501 నెంబర్ గల విశాఖపట్నం – కొల్లాం వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి, అదే రోజు రాత్రి 9:25 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. అక్కడ నుంచి తమిళనాడు మీదుగా బుధవారం మధ్యాహ్నం 2:50 గంటలకు కేరళలోని కొల్లాం చేరుకుంటుంది. ఇక 18502 నెంబర్ గల మరో రైలు అదే రోజు (బుధవారం) సాయంత్రం 5:20 గంటలకు ఈ రైలు కొల్లాం నుంచి బయల్దేరి, తమిళనాడు మీదుగా గురువారం ఉదయం 10:15 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ప్రయాణించి అదే రోజు రాత్రి 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇప్పటివరకు రద్దీకి అనుగుణంగా (స్పెషల్ రైలుగా) నడిచిన ఈ రైలు, ఇకపై వీక్లీ ఎక్స్‌ప్ర్రెస్‌గా ఈ నెల 12వ తేదీ నుంచి రాకపోకలు సాగిస్తోంది.
తిరుపతి – ఛాప్రా ప్రత్యేక రైలు (07443 / 07444)
07443 నెంబర్ గల తిరుపతి – ఛాప్రా ప్రత్యేక రైలు ఈ ప్రత్యేక రైలు తిరుపతి నుంచి బయల్దేరి కర్నూలు, నిజామాబాద్, నాందేడ్, అకోలా, భోపాల్, కాన్పూర్, లక్నో, అయోధ్య మీదుగా ఛాప్రా చేరుకుంటుంది. అలాగే 07444గల మరో రైలు తిరుగు ప్రయాణంలో ఛాప్రా నుంచి బయల్దేరి, వచ్చిన మార్గంలోనే తిరిగి తిరుపతికి చేరుకుంటుంది.
తిరుపతి – పండరీపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17437 / 17438)
17437 నెంబర్ గల తిరుపతి – పండరీపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 4:00 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి కర్నూలు, సికింద్రాబాద్, బీదర్, లాతూర్ మీదుగా ఆదివారం సాయంత్రం 7:00 గంటలకు పండరీపూర్ చేరుకుంటుంది. అలాగే 17438 నెంబర్ గల అదే రోజు (ఆదివారం) రాత్రి 8:00 గంటలకు పండరీపూర్ నుంచి బయల్దేరి, వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ సోమవారం రాత్రి 11:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.ఇప్పటివరకు రద్దీకి అనుగుణంగా నడిచిన ఈ రైలు, ఇకపై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుగా ఈ నెల 16వ తేదీ నుంచి నడవనుంది.
నాందేడ్ – తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17633 / 17634)
17633 నెంబర్ గల నాందేడ్ – తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 4:45 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరి నిజామాబాద్, వరంగల్, విజయవాడ మీదుగా ఆదివారం మధ్యాహ్నం 12:20 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. అలాగే 17634 నెంబర్ గల మరో రైలు అదే రోజు (ఆదివారం) రాత్రి 7:45 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరి, వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ సోమవారం సాయంత్రం 6:20 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఇప్పటివరకు రద్దీకి అనుగుణంగా నడిచిన ఈ రైలు, ఇకపై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా ఈ నెల 9వ తేదీ నుంచి నడుస్తోంది.
జాల్నా – తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17637 / 17638)
17637 నెంబర్ గల జాల్నా – తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం ఉదయం 7:00 గంటలకు జాల్నా నుంచి బయల్దేరి లాతూర్, బీదర్, లింగంపల్లి, నల్గొండ, గుంటూరు, నెల్లూరు మీదుగా మంగళవారం మధ్యాహ్నం 12:00 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. అలాగే 17638 నెంబర్ గల మరో రైలు అదే రోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:15 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరి, వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ బుధవారం రాత్రి 9:00 గంటలకు జాల్నాకు చేరుకుంటుంది. ఇప్పటివరకు రద్దీకి అనుగుణంగా నడిచిన ఈ రైలు, ఇకపై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా ఈ నెల 11వ తేదీ నుంచి నడుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.