సింగల్ రోడ్.. ఉదయాన్నే శుభకార్యానికి బయలుదేరారు.. మార్గమధ్యలో ఊహించని ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో తెల్లవారుజామున జరిగింది. యాసిడ్ తీసుకుని వెళుతున్న వాహనం ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు..

సింగల్ రోడ్.. ఉదయాన్నే శుభకార్యానికి బయలుదేరారు.. మార్గమధ్యలో ఊహించని ప్రమాదం..
Road Accident
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 06, 2024 | 11:30 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో తెల్లవారుజామున జరిగింది. యాసిడ్ తీసుకుని వెళుతున్న వాహనం ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మరొకరు ఆసుపత్రికి తీసువెళుకున్న క్రమంలో.. మార్గమద్యలో మృతి చెందాడు.. మరొకరికి తీవ్రగాయాలు కాగా.. అతన్ని రాయతోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం వద్ద యాసిడ్ తో ట్యాంకర్ లారీ.. కారు ఢీకొన్నాయి.. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. మృతులు రాయచోటి సమీపంలోని ఓ గ్రామంలో జరిగే శుభకార్యానికి వెళుతుండగా శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.

వీరంతా కడప నగరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అందులో ఒకరు హోంగార్డు కూడా ఉన్నారు.. ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. రాయచోటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో కారు లారీ వెనక భాగంలో ఢీకొట్టింది.. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

శుభకార్యానికి బయలుదేరి వెళుతున్న క్రమంలో.. కుటుంబసభ్యులు ఇలా మృత్యువాత పడటంతో బంధువులు శోకసంద్రంలో మునిగారు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదంటూ రోదిస్తున్నారు.

అన్నమయ్య జిల్లా రామాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా… కడప నుంచి రాయచోటికి వెళ్లే మార్గం సింగిల్ రోడ్ లైన్ కావడంతో ఓవర్ టెక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..