Assembly Election: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. 90 స్థానాలకే ఒకే విడతలో..

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు ఓకే విడతలో పోలింగ్ జరుగనుంది.ఈ పోలింగ్‌ ఉదయం గం. 7.00 నుంచి సాయంత్రం గం. 6.00 వరకు జరగనున్న పోలింగ్ కోసం గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల బరిలో వివిధ పార్టీల నుంచి మొత్తం 1,031 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా..

Assembly Election: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. 90 స్థానాలకే ఒకే విడతలో..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 05, 2024 | 9:32 AM

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు ఓకే విడతలో పోలింగ్ జరుగనుంది.ఈ పోలింగ్‌ ఉదయం గం. 7.00 నుంచి సాయంత్రం గం. 6.00 వరకు జరగనున్న పోలింగ్ కోసం గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల బరిలో వివిధ పార్టీల నుంచి మొత్తం 1,031 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.

ఇందులో 8,821 మంది శతాధిక వృద్ధులతో పాటు మొత్తం 2,03,54,350 మందికి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు కొనసాగనుంది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన ప్రచారంలో ఎవరు నెగ్గుతారన్నది అందరిలో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ హోరాహోరీ ప్రయత్నాలు చేసింది.

కొద్ది నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చెరో 5 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఎలాగైనా అధికారం చేపట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ 7 హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ఈ రెండు పార్టీలతో పాటు జననాయక్ జనతా పార్టీ (JJP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) పోటీలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా మారింది బీజేపీ. అయితే రైతులు, యువత, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెరిగిన ధరలు వంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి