Watch Video: పిన్నెల్లి అరెస్ట్‎పై రాజకీయ రగడ.. వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు..

పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఘటన జరిగిన 9 రోజుల తర్వాత కేసులు పెట్టడం.. ఈవీఎం ధ్వంసం వీడియో ప్రస్తుత మంత్రి లోకేష్‌కి లీక్ కావడాన్ని బట్టి చూస్తే అది అర్థమవుతుందన్నారు. అలాగే వైసీపీ కార్యాలయాలపై కూడా స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత టీడీపీ హయాంలో ఇచ్చిన జీవోల ప్రకారమే పార్టీ ఆఫీసులను నిర్మించామన్నారాయన. అయితే ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ చుట్టూ రాజకీయ రగడ మొదలైంది.

Watch Video: పిన్నెల్లి అరెస్ట్‎పై రాజకీయ రగడ.. వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు..
Former Minister Ambati Ramb
Follow us

|

Updated on: Jun 27, 2024 | 7:21 PM

పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఘటన జరిగిన 9 రోజుల తర్వాత కేసులు పెట్టడం.. ఈవీఎం ధ్వంసం వీడియో ప్రస్తుత మంత్రి లోకేష్‌కి లీక్ కావడాన్ని బట్టి చూస్తే అది అర్థమవుతుందన్నారు. అలాగే వైసీపీ కార్యాలయాలపై కూడా స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత టీడీపీ హయాంలో ఇచ్చిన జీవోల ప్రకారమే పార్టీ ఆఫీసులను నిర్మించామన్నారాయన. అయితే ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని టీడీపీ వాదిస్తుంటే.. తమ పార్టీనేతపై అక్రమంగా కేసులు పెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసు సహా.. పలు కేసుల్లో అరెస్టైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెండు కేసుల్లో కోర్ట్ రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. అయనకు బెయిల్ ఎప్పుడు వస్తుంది? కేసుల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది.

అయితే ఈ అరెస్ట్ చుట్టూ రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారన్నారు. ప్రజాదరణ ఉన్న నాయకుడు, వరుసగా నాలుగుసార్లు గెలిచిన నేత అని ఈ సందర్భంగా తెలిపారు. పిన్నెల్లికి బెయిల్ రాకుండా చేసేందుకు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. పిన్నెల్లి కుటుంబాన్ని టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి. కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు కాసు మహేష్‌రెడ్డి. పిన్నెల్లిని కోర్టుకు హాజరుపరిచే సమయంలో దాడి చేసే ప్రయత్నం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తోందనీ.. ప్రజాస్వామ్యంలో ఎదురుదాడి రాజకీయాలు సరికాదనీ అంటున్నారు వైసీపీ నేతలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్