Satrucharla Vijayaramaraju: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

ఏపీ రాజకీయాల్లో మరో విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.

Satrucharla Vijayaramaraju: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Satrucharla Vijayaramaraju Death

Updated on: Nov 12, 2026 | 4:52 PM

ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి చెందారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 1948 ఆగస్టు 4న జన్మించిన ఈయన 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన రాజకీయ జీవితంలో మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే మూడుసార్లు ఎంపీగా కూడా విజయం సాధించారు.

ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రోశయ్య హయాంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 2017లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజాసేవ చేసిన శత్రుచర్ల విజయరామరాజు మరణవార్త రాజకీయ వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఆయన మరణంపై సీఎం చంద్రబాబు సహా మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us