AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం కప్పు గోధుమ పిండితో స్వీట్ షాప్ రుచి మీ ఇంట్లోనే

పండుగలు వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా మనకు ముందుగా గుర్తొచ్చేది మిఠాయిలే. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన బందరు హల్వాకు ఉండే క్రేజే వేరు. బయట స్వీట్ షాపుల్లో కొనే ఈ హల్వాను ఇంట్లోనే ఎంతో స్వచ్ఛంగా, పక్కా కొలతలతో తయారు చేసుకోవచ్చు. సాధారణంగా దీనిని గోధుమ పాలతో చేస్తారు, కానీ ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే ఆ పాలు తీసి అద్భుతమైన హల్వాను సిద్ధం చేయవచ్చు.

Phani CH
|

Updated on: Nov 12, 2026 | 4:35 PM

Share
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నీళ్లు 4 కప్పులు (పిండి తడపడానికి, పాలు తీయడానికి కలిపి), చక్కెర 1 ముప్పావు కప్పులు (పాకం కోసం 1 పావు కప్పు, క్యారమెల్ కోసం అర కప్పు), నెయ్యి అర కప్పు, జీడిపప్పు పలుకులు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి అర టీస్పూన్.

1 / 5
ముందుగా ఒక గిన్నెలో కప్పు గోధుమ పిండి తీసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను చిన్న భాగాలుగా విడదీసి, మూడు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి బాగా నాననివ్వాలి. పిండి పూర్తిగా నాని మెత్తబడిన తర్వాత చేత్తో బాగా పిసుకుతూ పిండిలోని సారాన్ని అంతా నీటిలోకి వచ్చేలా కలపాలి.

2 / 5
ఇప్పుడు సన్నని జల్లెడ లేదా పలుచని వస్త్రం సహాయంతో ఈ పాలను వడకట్టుకోవాలి. మిగిలిన పిప్పిలో మరో కప్పు నీళ్లు పోసి కలిపి మళ్లీ వడకట్టాలి. పిప్పి అంతా రబ్బరులా మారిన తర్వాత దాన్ని పక్కన పడేయాలి. వడకట్టిన గోధుమ పాలను కదపకుండా పక్కన ఉంచితే, తేట నీరు పైకి తేలి చిక్కని పాలు అడుగున పేరుకుంటాయి. పైన ఉన్న తేట నీటిని ఒంపేసి, అడుగున ఉన్న స్వచ్ఛమైన గోధుమ పాలను సిద్ధం చేసుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టి, అందులో ఒకటింపావు కప్పు చక్కెర, పావు కప్పు నీళ్లు పోసి చక్కెర కరిగే వరకు మరిగించాలి. మరోవైపు ఇంకో పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు పలుకులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన అర కప్పు చక్కెర వేసి సన్నని మంటపై కలుపుతుంటే, అది కరిగి మంచి గోధుమ రంగులోకి (క్యారమెల్) మారుతుంది. హల్వాకు అసలైన రంగు, రుచి వచ్చేది ఈ క్యారమెల్ వల్లే.

4 / 5
కడాయిలో చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత, మంటను తగ్గించి ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పాలను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడిన తర్వాత, తయారు చేసుకున్న క్యారమెల్ సిరప్‌ను ఇందులో పోసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ నిరంతరం కలుపుతూ ఉడికించాలి. హల్వా నెయ్యిని పీల్చుకుని, తిరిగి నెయ్యిని బయటకు వదులుతూ కడాయి అంచులకు అంటుకోకుండా ముద్దలా మారుతుంది. చివరగా వేయించిన జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడిగా తిన్నా లేదా ఒక గిన్నెలో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకుని తిన్నా ఈ బందరు హల్వా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us