Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి NDA సర్కార్ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలా ఒక్కో నిర్ణయం వెలువరిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
CM Chandrababu
Follow us

|

Updated on: Jun 27, 2024 | 6:39 PM

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం మరికొంతకాలం పాటు కొనసాగించాలని నిర్ణయించింది. సెక్రటేరియట్, HODలలో పని చేసే ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. వాస్తవానికి ఐదు రోజుల వర్కింగ్ డేస్ విధానం నేటితో ముగిసిపోతుంది. సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో గడువు పొడిగింపునకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. తమ విజ్ఞప్తిని పరిశీలించి మరొక సంవత్సరం పాటు వారానికి ఐదు రోజుల పనిని కొనసాగించే ప్రతిపాదనకు ఓకే చెప్పినందకు సీఎంకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది.

రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించిన నేపథ్యంలో ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్‌కు వచ్చి పోయేందుకు వీలుగా వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిపిందే. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే వీరు పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ సర్కార్ ఈ విధానాన్ని కొనసాగించింది. ఆ గడువు నేటితో ముగిసిపోతున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..