RRR Movie Theater: ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో తీవ్ర విషాదం.. సినిమా చూస్తూ ఓ అభిమాని గుండెపోటుతో మృతి

|

Mar 25, 2022 | 11:01 AM

RRR Movie Theater: ఓ వైపు దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మానియా ఓ రేంజ్ లో నెలకొంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR) అభిమానులు గత రాత్రి నుంచే థియేటర్స్..

RRR Movie Theater: ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో తీవ్ర విషాదం.. సినిమా చూస్తూ ఓ అభిమాని గుండెపోటుతో మృతి
Fan Dies In Anantapur
Follow us on

RRR Movie Theater: ఓ వైపు దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మానియా ఓ రేంజ్ లో నెలకొంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR) అభిమానులు గత రాత్రి నుంచే థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ హంగామాతో థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ సినీ థియేటర్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ లో  ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు.

RRR సినిమా థియేటర్ లో గుండెపోటుతో మృతి చెందిన అభిమానిని అంబేద్కర్ నగర్ కు చెందిన ఓబిలేసుగా గుర్తించారు. సినిమా రిలీజ్ సందర్భంగా గత రాత్రి నుంచి సినిమా థియేటర్ వద్ద ఓబిలేసు సందడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇతనికి గతంలో హార్ట్ అటాక్ రావడంతో వైద్యులు స్టంట్ వేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షో కి తెల్లవారుజామున సినిమా థియేటర్ కు వచ్చిన ఓబులేశు…  ప్రదర్శన సమయంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన తోటివారు హుటాహుటిన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే ఓబిలేసు మృతి చెందాడు. దీంతో థియేటర్ వద్ద తీవ్ర విషాదం నెలకొంది.

Also Read: RRR Movie: భ్రమరాంబ థియేటర్‌లో రాజమౌళి, చెర్రీల సహా ఫ్యామిలీల సందడి.. మూవీకోసం క్యూ కట్టిన సెలబ్రెటీలు

KRK on RRR: ఆర్ఆర్ఆర్‌ మూవీపై వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్.ఖాన్ సంచలన కామెంట్స్