స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు ఈ నెల 28న (ఇవాళ) విశాఖ(Vizag) బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. 29న జాతీయ సమ్మెకు(Protest) సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు సోమవారం (మార్చి 28), మంగళవారం (మార్చి 29) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టంలో మార్పులకు నిరసనగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ( trade unions) రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రాంతాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యక్రమాలు రూపొందించారు. బైక్ ర్యాలీలు, నిరసనలు చేపట్టనున్నారు. ఈ ఆందోళనలకు బ్యాంకు ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణ(Privatization) నిలుపుదల, ఒప్పంద ఉద్యోగులు, బిజినెస్ కరస్పాండెంట్లను క్రమబద్ధీకరించడం, బ్యాంకుల మొండిబకాయిల వసూలు, పాత పింఛను అమలు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీతమ్మధారలోని యూనియన్ బ్యాంకు రీజనల్ కార్యాలయం వద్ద నేడు ధర్నా నిర్వహించనున్నారు.
అయితే వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంద్‌లో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పాల్గొనడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించకపోవడంతో సోమవారం, మంగళవారాల్లో ఆర్టీసీ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఇన్ ఛార్జ్ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. బంద్‌కు సంఘీభావంగా ఆర్టీసీ ఉద్యోగులు రెండు రోజులపాటు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు.
Also Read
Yadadri: యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం.. కొన్నిగంటల్లో లక్ష్మీనరసింహస్వామి దర్శనం..
Tesla: టెస్లా కంపెనీకి చెందిన 947 కార్లు రీకాల్.. ఎందుకో తెలుసా..?