వాన కిటుకు.. ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?

ఉత్తర, ఈశాన్య భారతాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం లోటు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలపైనే రైతుల ఆశలు నిలిచాయి.

వాన కిటుకు.. ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?
El Nino Fear

Updated on: Sep 02, 2026 | 9:58 PM

రాకాసి వరదకు శిథిలమైంది నేపాల్ దేశం. దాని తాలూకు వైరల్ వీడియోలతో ఇప్పటికీ మోతెక్కిపోతోంది సోషల్ మీడియా. బురద కింద కూరుకుపోయిన వేలాది బతుకులు, వరద నుంచి దూరంగా పారిపోయి బతికిబైటపడ్డవారి బరువైన దృశ్యాలతో నెట్టంతా నిండిపోయింది. కానీ, ఇండియా లోపల అంతకంటే ఘోరమైన విపత్తు పొంచి ఉందని, ఇప్పటికే ఇక్కడి జనజీవితాల్ని ఛిద్రం చేస్తోందని ఎంతమందికి తెలుసు? కుండపోత వానలతో ఉత్తర, ఈశాన్య భారతాన్ని ముంచెత్తిన వరుణుడు.. దక్షిణాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. మినిమమ్ రెయిన్ ఫాల్ లేక, తీవ్రమైన వర్షాభావంతో పంటపొలాలన్నిటా ప్రేతకళ తాండవిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్ని.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్ని నిలువెల్లా వణికిస్తోంది ఎల్‌నినో ఫియర్. దేశాన్ని వేధిస్తున్న ఈ డబుల్ ధమాకా వెనుక అసలు మర్మమేంటి అని శోధిస్తున్నారు వెదర్ ఎక్స్‌పర్ట్స్‌. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో పొంగిపొర్లుతున్న గంగా, యమున నదుల ఉగ్రరూపం ఇది. పక్కనున్న ఇళ్లను, వంతెనల్ని పేకమేడల్లా కూల్చడానికా అన్నట్టు నిలువునా కోసుకుపోతున్నట్టుంది తీరప్రాంతమంతా. నేపాల్‌ ముప్పెనను మరిపించే రేంజ్‌లో ఉంది పరిస్థితి. పంచప్రయాగల్లోని అలకానంద, మందాకిని నదుల పరిస్థితి కూడా అంతే భయానకంగా ఉంది. ప్రమాదకర స్థాయిని మించి పారుతూ రుద్రప్రయాగ్‌ మొత్తాన్నీ ముంచెత్తుతానంటోంది. ఎటువంటి ప్రకృతి వైపరీత్యానికైనా సిద్ధంగా ఉండండి అని రెడ్ అలర్ట్...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి