Duvvada Family Issue : ‘నీ ఇల్లు బంగారం కాను..’ అందరి కళ్లు ఆ గృహంపైనే

|

Aug 16, 2024 | 9:54 AM

నీ ఇల్లు బంగారం కాను.. అనే పాట అంతా వినే ఉంటారు. కాని ఇక్కడ నిజంగానే ఆ ఇంటిని బంగారంలా చూస్తున్నారు. టెక్కలిలోని ప్రైమ్‌ లొకేషన్‌లో ఉన్న ఆ ఇంటిపై ముగ్గురి కళ్లు పడ్డాయి. అది నా ఇల్లుంటే నా ఇల్లు అంటూ పేచీ పెట్టుకు కూర్చున్నారు. కొన్ని రోజుల క్రితం దువ్వాడ ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్‌గా మొదలై.. ఇప్పుడు ఆస్తుల యాంగిల్‌లోకి టర్న్‌ అయింది. ఇందులో ఆ ఇల్లే సెంటర్‌ ఆఫ్‌ కాంట్రవర్సీగా మారింది. ఇప్పుడీ వివాదంలోకి నాలుగో వ్యక్తి ఎంటర్‌ అయ్యారు.

Duvvada Family Issue : నీ ఇల్లు బంగారం కాను.. అందరి కళ్లు ఆ గృహంపైనే
Duvvada Home
Follow us on

ఒక్క దువ్వాడ.. ఎన్నో వివాదాలు. ఒక్క వ్యక్తి సమస్యల్లో ఎన్నో కోణాలు. అటు భార్యతో సఖ్యత లేదు. కూతుళ్లు చీదరించుకుంటున్నారు. ఇన్నాళ్లూ తనతో ఉన్న మాధురి ఇప్పుడు లేదు. ఇంట్లో ఒంటరి జీవితం. ఇల్లే ప్రపంచం అయిపోయింది. టెక్కలి అనే పేరు అప్పుడపుడు వినడమేగాని.. రెండు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం లేని ఊరు. అక్కడ పెద్దగా రియల్‌ ఎస్టేట్‌ నడిచే వ్యవహారం కూడా లేదు. కాని అక్కడ ఉన్న ఈ ఇల్లే అన్ని వివాదాలకూ కేంద్ర బిందువుగా మారింది.

ఇది దువ్వాడ శ్రీనివాస్‌ ఇల్లే. ఈ ఇంట్లో ఉంటున్నది ఆయనే. ఆయన సోదరుడు కూడా ఉంటున్నాడు. ఇన్నాళ్లూ మాధురి కూడా ఇక్కడే నివాసం ఉంది. అంతక ముందు దువ్వాడ భార్య వాణి ఉన్నా.. ఆతర్వత గొడవల కారణంగా ఇద్దరూ విడిపోయి… ఆమె బయటకు వెళ్లిపోవడం.. ఈయన మాత్రం ఇక్కడే కాపురం ఉంటూ ఉండడం జరుగుతోంది. ఈ ఇల్లు, ఇంటితోపాటు అందులో ఉంటున్న వ్యక్తులు అంతా వివాదాస్పదమే. అసలు ఈ ఇంటి నిర్మాణానికి డబ్బు ఇచ్చిందే తానని చెబుతున్నారు దువ్వాడ శ్రీను భార్య వాణి.

అసలు ఈ ఇల్లు ఖర్చు ఎంత.. మీరు ఇచ్చిందెంత అంటున్నారు దువ్వాడ శ్రీను. ఈ ఇల్లు ముమ్మాటికీ తనదే అంటున్నారు. ఈ ఇల్లు లేకుంటే తాను లేనని చెబుతున్నారు. మీకు ఎంత హక్కు ఉందో… తనకూ అంతే హక్కు ఉందంటున్నారు మాధురి. ఆ ఇంటి నిర్మాణానికి తాను కూడా డబ్బు ఇచ్చానంటున్నారు.

ఎవరండీ మీరంతా.. నా భూమి కొనుగోలు చేసి.. డబ్బులు ఇవ్వకుండా.. నాదంటే నాదని ఇంటి కోసం కొట్టుకుంటున్నారు. నా 60 లక్షలు ఇవ్వలేదనుకో.. ఇంటికి తాళం వేసేస్తానంటున్నారు టెక్కలికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌. ఈ ఇంటి నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చింది ఈయనే. టెక్కలి అక్కవరంలోని ఈ భూమి మొత్తం విస్తీర్ణం 931.7 చదరపు గజాలు. అంటే 19 సెంట్ల భూమిని.. గతేడాది ఆగస్ట్‌ 8న రిటైర్డు టీచర్ చింతాడ పార్వతీశ్వర రావు నుంచి కొనుగోలు చేశారు దువ్వాడ శ్రీనివాస్‌. అప్పట్లో ప్రభుత్వ ధర ప్రకారం 18లక్షల 64 వేల రూపాయలు. కాని బహిరంగ మార్కెట్లో దీని ధర భారీగానే ఉంది. దీంతో అంతే ధరకు దక్కించుకున్నారు దువ్వాడ శ్రీనివాస్‌. అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడంతో.. ఆయన ఇచ్చిన పలు చెక్కులను తీసుకుని భూమిని అమ్మేశారు చింతాడ పార్వతీశ్వర్రావు. ఆ స్థలంపై తనకు ఇంకా 60 లక్షల రూపాయలు MLC దువ్వాడ బాకీ ఉన్నారని అంటున్నారాయన. 60 లక్షలకు చెక్కులు ఇచ్చి ఇంతవరకు వాటిని క్లియర్ చేయలేదంటున్నారు. తన డబ్బులు వాణి ఇస్తారో, శ్రీనివాస్ ఇస్తారో తేల్చుకోవాలని.. లేదంటే ఆ ఇంటికి తాళం వేసి స్వాధీనపరుచుకుంటానంటున్నారు పార్వతీశ్వర్రావు.

Parvateshwar Rao

అందరి కళ్లూ ఆ ఇంటిపైనే… అందరికీ అదే కావాలి. మరి దువ్వాడ ఎవరికి కావాలి? అనేది ప్రధాన ప్రశ్న.