
వాసవి కలెక్షన్స్ అని బోర్డు.. దగ దగా అని మెరిసే ఆభరణాలు కనిపించడంతో.. చూపు దాని వైపు పడంది.. ఇంకేముంది.. లేడీ గ్యాంగ్ అంతా.. అటువైపు అడుగులు వేశారు.. గోల్డ్ షాప్ అనుకుని రోల్డ్ గోల్డ్ షాపులో వెళ్లిన ఆ కిలాడీ మహిళలు.. చేతివాటం చూపించారు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని వాసవి కలెక్షన్స్ దుకాణంలోకి కస్టమర్లు మాదిరిగా ఆరుగురు మహిళలు ప్రవేశించారు. తీరా వచ్చాక తెలిసింది.. అది గోల్డ్ షాప్ కాదు ఫ్యాన్సీ షాపు అని.. ఎట్లాగూ వచ్చాము కదా అని… ఆరుగురు మహిళల్లో ఇద్దరు సేల్స్ గర్ల్ ను మాటల్లో పెట్టగా.. మరో ఇద్దరు సేల్స్ గర్ల్ కు కనిపించకుండా ఉండేందుకు అడ్డుగా నిలబడ్డారు. ఇక మిగిలిన ఇద్దరు మహిళలు షాపు అరలోని రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, వస్తువులు సర్దేశారు.
తమ పని పూర్తవ్వగానే మెల్లిగా ఒక్కొక్కరు జారుకున్నారు.. ఆరుగురు మహిళలు షాపులోకి వచ్చి ఏమీ కొనకుండా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన షాపు యజమాని సీసీ కెమెరా చూసి షాక్ అయ్యాడు. కిలాడీ లేడీల చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
దాదాపు 18 వేల రూపాయలు విలువచేసి రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, వస్తువులు చోరీ చేశారని కిలాడీ లేడీలపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కిలేడీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..