Vizianagaram District: యువతిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం

విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి...

Vizianagaram District: యువతిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా.. నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం
Cm Jagan

Updated on: Aug 20, 2021 | 5:15 PM

విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోల్ దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితురాలికి అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.  నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉండాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలిని మంత్రులు బొత్స, పుష్పశ్రీవాణి పరామర్శించారు.  యువతితో మాట్లాడిన మంత్రులు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.

“గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తాం. బాధితులను విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆస్పత్రికి తరలిస్తున్నాం.దిశ యాప్ వల్లే బాధితులను సకాలంలో కాపాడగలిగాం. పోలీసులు వెంటనే స్పందించి బాధితులను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు” అని.. మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ తెలిపారు.

అసలేం జరిగిందంటే..

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో దారుణం జరిగింది. యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి.. గాయాలయ్యాయి. ముగ్గురినీ విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.  నిందితుడు నరవకు చెందిన రాంబాబుగా గుర్తించారు. రాంబాబు, ఆ యువతి గత కొన్ని రోజులుగా లవ్‌లో ఉన్నారు. ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకరించాయి. అయితే ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందంటూ రాంబాబు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు. పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు సమ్మతించాడు. ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ గ్రామం నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింగారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని చెబుతున్నారు.

Also Read: ఒళ్లు కొవ్వెక్కి తిక్క వేశాలు వేసిన ఈవెంట్ మేనేజర్.. గుడ్డలూడదీసి కొట్టిన యువతులు

రెండు రాష్ట్రాలు, మూడు జిల్లాలు.. నలుగురు మనుషులు.. రెండు వివాహేతర సంబంధాలు.. ఒక మర్డర్

Loading...
Unable to load recommendations.
Follow Us