Jagan New Cabinet: బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్‌ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌.. జగన్ 2.0లో బడుగులకు ఎన్ని మంత్రి పదవులో తెలుసా..

|

Apr 10, 2022 | 8:29 PM

బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్‌ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌ అని నిరూపించారు సీఎం జగన్. కొత్త కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట వేశారు. ఏకంగా 10మంది బీసీలకు చోటుకల్పించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యం కల్పించారు. ఫైనల్‌గా..

Jagan New Cabinet: బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్‌ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌.. జగన్ 2.0లో బడుగులకు ఎన్ని మంత్రి పదవులో తెలుసా..
Cm Jagan
Follow us on

బీసీలంటే(BC) బ్యాక్ వర్డ్ క్లాస్‌ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌ అని నిరూపించారు సీఎం జగన్(CM Jagan). కొత్త కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట వేశారు. ఏకంగా 10మంది బీసీలకు చోటుకల్పించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యం కల్పించారు. ఫైనల్‌గా పాత-కొత్త కలయికతో ఏపీ కేబినెట్‌ కొలువు దీరబోతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెటే సామాజిక విప్లవం.. ఇప్పుడు పునర్‌ వ్యవస్థీకరణతో మరో సామాజిక మహా విప్లవం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బీసీలకు 10, ఎస్సీలకు- 5, ఎస్టీలు, మైనారిటీలకు చెరొకటి, కాపు-రెడ్డి సామాజిక వర్గాలకు చెరో నాలుగు పదవులు కేటాయించారు. ఎవరూ ఊహించని విధంగా పదిమంది బీసీలకు మంత్రి పదవులు కేటాయించారు.

సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్‌, విడదల రజినీ, ఉషశ్రీ చరణ్‌, గుమ్మనూరు జయరాంలను సీఎం జగన్ కేబినెట్‌లోకి తీసుకున్నారు. కొత్త జిల్లాలు, రాజకీయ సమీకరణాలు, అనుభవం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీరిని ఎంపిక చేసినట్టు స్పష్టమవుతోంది. ఏకంగా పదిమంది బీసీలకు పదవులిచ్చి బీసీలకు అగ్రతాంబులం ఇచ్చామనే సంకేతాలిచ్చారు.

సీఎం జగన్‌ తొలి కేబినెట్‌లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటిచ్చారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ సారి 25 మందిలో 70 శాతం బడుగు బలహీనవర్గాలే. మొదటి నుంచి ముఖ్యమంత్రి ఈ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు సజ్జల.

సామాజిక న్యాయం జరిగే క్రమంలో కొంతమంది నేతలకు అవకాశం చేజారింది. పదవులు ఆశించిన బాలినేని, పిన్నెల్లి, ఉదయభాను, కోటంరెడ్డిలకు నిరాశ ఎదురైంది. మొదట్లో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని అలక వీడారు. సీఎం జగన్‌ వెంట నడుస్తామని ప్రకటించారు.

 కొత్త కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట

  1. పాత-కొత్త కాంబినేషన్‌లో సామాజిక న్యాయం
  2. 10- బీసీ, 5-ఎస్సీ, 1-ఎస్టీ, 1-మైనారిటీలకు ప్రాధాన్యం
  3. 25 మందిలో 70% బడుగు బలహీనవర్గాలు
  4. సామాజిక న్యాయంతో కొంతమంది నేతలకు నిరాశ
  5. మొదట్లో అసంతృప్తి.. ఆ తర్వాత అలక వీడిన నేతలు
  6. జగన్‌ వెంటే ఉంటామన్న నేతల ప్రకటన

ఇవి కూడా చదవండి: Kottu Satyanarayana: పదిహేనేళ్ల గ్యాప్‌.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు జగన్ మంత్రి వర్గంలో..

Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు..