TTD: తిరుమలలో పనిచేస్తున్న ఇతర మతస్థులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాణిజ్యీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనేక అనుమతులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముంతాజ్ హోటల్‌తో సహా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయబడ్డాయి. తిరుమలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ఆయన స్పందించి, ఇతర మతస్థులను ఇతర శాఖలకు మార్చనున్నట్లు తెలిపారు.
హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలను కమర్షియలైజ్ చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనేక అనుమతులను రద్దు చేస్తున్నామన్నారు. ఏడు కొండలపై ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు.
ఏడు కొండలను కమర్షియలైజ్ చేయొద్దని.. ముంతాజ్ హోటల్‌తో పాటు అనేక ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాం అని వెల్లడించారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి స్పందించారు సీఎం. తిరుమలలో పనిచేసే ఇతర మతస్థులను వేరే శాఖలకు పంపుతామన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఈ చర్య తీసుకుంటామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Mar 21, 2025 12:35 PM