Chandrababu: ’30 ఏళ్ల నుంచి సెలవు కూడా తీసుకోకుండా మిషన్‌లా పని చేస్తున్నా’

Updated on: Sep 01, 2025 | 6:30 PM

తన పాలనలో విజన్ 2020 ప్రవేశపెట్టినట్లు, ప్రస్తుతం విజన్ 2047 లక్ష్యంతో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంపై దృష్టి సారించారని చంద్రబాబు తెలిపారు. ఈ 20 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. 

రాజంపేట నియోజకవర్గం బోయనపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. 30 ఏళ్ల నుంచి సెలవు కూడా తీసుకోకుండా మిషన్‌లా పని చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనదన్నారు. విజన్ 2047 ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే అధికారాన్ని ఉపయోగించిందని కూడా ఆయన అన్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Sep 01, 2025 06:29 PM