Raghu Rama Krishna Raju: ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

MP Raghu Rama Krishna Raju: కరోనా వైఫల్యాలను ప్రశ్నించిన ఎంపీ రాఘురామ కృష్ణరాజును దేశద్రోహం కేసు వేస్తారా..? అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు...

Raghu Rama Krishna Raju: ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu

Updated on: May 14, 2021 | 11:41 PM

MP Raghu Rama Krishna Raju: కరోనా వైఫల్యాలను ప్రశ్నించిన ఎంపీ రాఘురామ కృష్ణరాజును దేశద్రోహం కేసు వేస్తారా..? అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. నర్సాపురం ఎంపీ రఘురామను సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై చంద్రబాబు స్పందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా అని మండిపడ్డారు.  జగన్‌ పాలనలో ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పగ, ప్రతీకారానికి వాడటం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వేళ ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.

ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారన్న అభియోగంపై ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయనను గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. సీఐడీ డీఐజీ సునీల్‌ కుమార్‌ గుంటూరుకు చేరుకున్నారు. రఘురామ కృష్ణరాజును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఆయనపై ఐపీసీ 124 (A), 153(A), 505, 124A, 120 (b) of IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవీ కూడా చదవండి:

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై హైకోర్టులో పిటిషన్‌.. నిబంధనల ప్రకారం అరెస్టు చేయలేదన్న న్యాయవాదులు

RRR Arrest : వైసీపీ ఎంపీ రఘురామ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన టీడీపీ, ఇప్పటికే సీఎం జగన్ చాలా ఓపికపట్టారన్న వైసీపీ

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతి.. ఊపిరి పీల్చుకున్న రోగుల బంధువులు

Follow Us