
నెట్టింట ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో బసవన్నలు ప్రవర్తించిన తీరుకు నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. అదో మూగజీవాల పోటీ మాదిరిగా ఉంది. ఆ పోటీలను జనం అంతా ఆసక్తికరంగా రెండు వైపులా నిలబడి తిలకిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక గుర్రంపై ప్రయాణిస్తున్న వ్యక్తి పట్టు తప్పి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే అతని వెనకే వేగంగా వస్తున్న జోడు ఎద్దులు అతన్ని తొక్కకుండా ఎగిరి దూకడం ఆశ్చర్యానికి గురి చేసింది. అవి మాత్రమే కాదు వాటి వెనకే వస్తున్న మరో జత జోడు ఎద్దులు సైతం కింద పడి ఉన్న అతనికి హాని జరగకుండా దూకి వెళ్లాయి. ఈ వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంత వేగంలో ఉండి కూడా మనిషికి హాని చేయకూడదన్న వాటి ప్రవర్తనకు జనం జేజేలు కొడుతున్నారు. బసవన్నలు కదా రైతుకు గాయం కాకూడదని భావించాయి అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. అదే మనుషులు అయితే తొక్కుకుంటూ పోయేవారు.. మూగజీవాలు కదా అందుకే అలా దాటి వెళ్లిపోయాయి అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోటీ ఉత్సాహం, వేగం, హోరాహోరీ వాతావరణం… ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ బసవన్నలు గమనించిన వెంటనే దూకి దూరంగా వెళ్లాయంటే వాటి సహజ జాగ్రత్త ఎంత గొప్పదో తెలుస్తోంది. వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి..