Challa Family: చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు.. ఏకంగా పార్టీ మార్చేసిన విజయభాస్కర్‌ రెడ్డి

కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో చీలిక వచ్చింది. చల్లా రామకృష్ణారెడ్డికి స్వయాన సోదరుడైన ఆవుకు సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆసక్తి రేపుతోంది. చల్లా ఫ్యామిలీ మొత్తం వైసీపీలో ఉంటే.. విజయభాస్కర్‌ రెడ్డి మాత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్‌ కావడం చర్చనీయాంశం అవుతోంది.

Challa Family: చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు.. ఏకంగా పార్టీ మార్చేసిన విజయభాస్కర్‌ రెడ్డి
Challa Vijay Bhaskar Reddy Joins Tdp
Follow us

|

Updated on: Mar 24, 2024 | 7:07 PM

కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో చీలిక వచ్చింది. చల్లా రామకృష్ణారెడ్డికి స్వయాన సోదరుడైన ఆవుకు సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆసక్తి రేపుతోంది. చల్లా ఫ్యామిలీ మొత్తం వైసీపీలో ఉంటే.. విజయభాస్కర్‌ రెడ్డి మాత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్‌ కావడం చర్చనీయాంశం అవుతోంది.

వాస్తవానికి.. చల్లా రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భగీరథరెడ్డి మృతి తర్వాత ఆ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. చల్లా ఫ్యామిలీ అంతా రెండు, మూడు వర్గాలుగా చీలిపోయింది. చల్లా పెద్ద కొడుకు విగ్నేష్‌రెడ్డి, చిన్నకొడుకు భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మికి మధ్య రాజకీయ వారసత్వ పోరు తారాస్థాయికి చేరింది. వ్యవహారం కేసులు.. కోర్టుల వరకు వెళ్ళింది. అయినప్పటికీ.. చల్లా కుటుంబమంతా వైసీపీలోనే ఉంది.

కానీ.. అవుకు మండలంలో చల్లా కుటుంబానికి ఉన్న గట్టి పట్టు నేపథ్యంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి వారి ఫ్యామిలీలో చీలిక తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చల్లా కుటుంబంలో విభేదాలను పసిగట్టిన టీడీపీ నేత బీసీ జనార్దన్‌రెడ్డి.. చల్లా విజయభాస్కర్‌ రెడ్డిపై ఫోకస్‌ పెట్టి.. టీడీపీలో చేర్పించి సక్సెస్ అయ్యారట.

మరోవైపు.. చల్లా కుటుంబంలో ఐక్యత కోసం బనగానపల్లె వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రామిరెడ్డి అనేకసార్లు చల్లా కుటుంబ సభ్యులను కలిసి విభేదాలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. విజయభాస్కర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో.. చల్లా ఫ్యామిలీ ప్రతిష్టపై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…