
ఇండియాలో క్యాపిటల్ ఆఫ్ ఆక్వా కల్చర్ ఏదంటే ఠక్కున చెప్పెయ్యొచ్చు ఆంధ్రా అని. ఎందుకంటే, దేశంలో 40 శాతానికిపైగా చేపలు, రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగేది. ఆమాటకొస్తే అరవైశాతం సీ-ఫుడ్ ప్రొడక్షన్‌కి కేరాఫ్ కూడా మన ఆంధ్రప్రదేశే. ఆక్వా ఎగుమతులతో ఏటా సగటున 66 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందంటే ఆంధ్రా రొయ్యకు విదేశాల్లో ఉండే గిరాకీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇటు, ఏపీ సర్కారుక్కూడా మేజర్ రెవెన్యూ సోర్స్ ఆక్వా కల్చరే. ఇందులో డౌటే లేదు. తెలంగాణకు ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు ఎలాగో, ఆంధ్రా పాలిట బంగారుబాతుగుడ్లు పెట్టే రంగం ఆక్వా. ఇంతటి ఘనత వహించిన ఆంధ్రా రొయ్య ఇప్పుడు అనాథ రొయ్యగా మారిందంటే, దానికి దారితీసిన పరిస్థితులేంటి? ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే సిట్యువేషన్ ఎందుకు క్రియేటైనట్టు? రొయ్య సాగు చతికిలపడ్డం వెనుక మతలబు ఏంటి? ఒకప్పుడు ఏపీ ఎకానమీకి వెన్నెముకగా నిలిచి, అంతర్జాతీయ ఎగుమతులతో కాసుల వర్షం కురిపించిన ఆక్వా రంగం… ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 2 లక్షల 45 వేల మంది ఆక్వా రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఆక్వారంగం మీద ఆధారపడ్డ 40 లక్షల మంది బతుకులు రోడ్డునపడ్డాయి. ఆంధ్రాలో ఆక్వా రాజధానిగా పేరున్న ఉభయ గోదావరి జిల్లాల్లో...