
నామినేషన్లు వేయని కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో జడ్పీటీజీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం లేదు. వైఎస్సార్ కడప జిల్లాలో సుగుమంచిపల్లి, కొండాపురం ఎంపీటీసీ స్థానాలకు, నామినేషన్లన్నీ తిరస్కరించిన కారణంగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కృష్ణగిరి ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించట్లేదు. దీంతో ఈ స్థానాల్లో ఇవాళ ఎన్నికలు జరగడం లేదు.
మురసు తుఫాన్ ప్రభావంతో ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది. ఈ ప్రాంతాల్లో శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలాల్లో పూర్తిగా పోలింగ్ వాయిదా పడింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి అభ్యర్థులు పిలుస్తున్నారు. ఓటు వేసేందుకు రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ చార్జీలు తామే చెల్లిస్తామంటూ అభ్యర్థులు చెబుతున్నారు. గ్రామ స్థాయిలో జరిగే ఈ ఎన్నికకు ప్రతీ ఓటూ కీలకమేనని అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకు ప్రతీ ఓటరును ఓటు వేసేందుకు అభ్యర్థిస్తున్నారు ఎన్నికల్లో పోటీకి నిలబడిన వ్యక్తులు. దీంతో జనం ఊరిబాట పట్టారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో బస్టాండ్ల దగ్గర జనం ఇబ్బంది పడ్డారు.
ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూరుకు ఏపీ వాసుల పయనమయ్యారు. ఇవాళ్టి పోలింగ్లో ఓటేసేందుకు సొంతూరుకు జనం వెళ్తున్నారు. ఎన్నికలతో పాటు దీపావళి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో RTC బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. అర్ధరాత్రి వరకు MGBS, ఎల్బీనగర్ బస్టాండ్లలో నిరీక్షించారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9వేల 829 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో 2వేల,51 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 77 ఏకగ్రీవమయ్యాయి. ఇక 7,767 ఎంపీటీసీ, 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా అన్ని విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. ఈనెల 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 ZPTC, 7వేల 767 MPTC స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోటీలో 18,952 మంది MPTC అభ్యర్థులు, 2,169 మంది జడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. ఏపీవ్యాప్తంగా 2.61 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 77 జడ్పీటీసీ, 2వేల 51 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 39 స్థానాలకు గానూ 23 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పల్నాడు జిల్లాలో 18, నంద్యాల జిల్లాలో 8, మార్కాపురం జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 5, తిరుపతి జిల్లాలో 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మూడేసి స్థానాలు, ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో ఒక్కో స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలో అత్యధికంగా 39 స్థానాలకు గానూ 23 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పల్నాడు జిల్లాలో 18, నంద్యాల జిల్లాలో 8, మార్కాపురం జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 5, తిరుపతి జిల్లాలో 4 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మూడేసి స్థానాలు, ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో ఒక్కో స్థానం ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికల విధుల్లో దాదాపు 2లక్షల 52 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల బయటే కాకుండా.. ఓటు రహస్యానికి భంగం కలగకుండా అవసరమైన చోట్ల లోపల కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో అలర్లు చోటుచేసుకున్న తరుణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి అంవాచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాాట్లు చేశారు.