AP ZPTC, MPTC Elections Result LIVE Updates: మరికాసేపట్లో ఏపీ MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్‌

AP ZPTC, MPTC Polls 2026 Result Live Updates in Telugu: ఏపీ స్థానిక ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం.. కాసేపట్లో MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

AP ZPTC, MPTC Elections Result LIVE Updates: మరికాసేపట్లో ఏపీ MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్‌
Ap Zptc, Mptc Election 2026 Results

Updated on: Nov 07, 2026 | 7:08 AM

LIVE NEWS & UPDATES

  • 07 Nov 2026 07:08 AM (IST)

    రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన ZPTC, MPTC స్థానాలు ఇవే

    రాష్ట్రవ్యాప్తంగా 77 ZPTC స్థానాలు ఏకగ్రీవం

    2,051 MPTC స్థానాలు ఏకగ్రీవం

    మిగిలిన 577 ZPTC, 7,707 MPTC స్థానాలకు నవంబర్ 5న పోలింగ్

    నవంబర్ 5న జరిగిన పోలింగ్‌లో 70.72 శాతం ఓటింగ్ నమోదు

    2021 ఎన్నికల్లో 60.91 శాతం పోలింగ్

    గత ఎన్నికలతో పోలిస్తే 9.81 శాతం పెరిగిన పోలింగ్

    7 పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 6న రీపోలింగ్

    రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్ల మధ్య నేడు ఫలితాల వెల్లడి

  • 07 Nov 2026 07:07 AM (IST)

    ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత

    కౌంటింగ్ హాళ్ల పరిమాణాన్ని బట్టి టేబుళ్ల సంఖ్య పెంచుకునే అవకాశం

    రాష్ట్రవ్యాప్తంగా 19,885 మంది పోలీసులతో మూడంచెల భద్రత

    135 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలతో భద్రతా ఏర్పాట్లు

    572 మంది సీఐలు, ఆర్‌ఐలు, 1,412 మంది ఎస్ఐల నియామకం

    3,996 మంది ఏఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ల మోహరింపు

    10,881 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 2,889 మంది హోంగార్డులతో బందోబస్తు

    సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా

    పోలీసుల బాడీ వోర్న్ కెమెరాలతోనూ పర్యవేక్షణ

    అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

    కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు

  • 07 Nov 2026 06:59 AM (IST)

    AP MPTC, ZPTC Polls Result: కాసేపట్లో ఏపీలో MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు

    రాష్ట్రవ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

    మొత్తం 9,062 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్ల లెక్కింపు

    కౌంటింగ్ విధుల్లో 11,002 మంది సూపర్‌వైజర్లు

    28,692 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, సిబ్బంది నియామకం

    ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

    ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు

    బ్యాలెట్ బాక్సుల్లోని గులాబీ రంగు పేపర్లు MPTC ఓట్లుగా గుర్తింపు

    తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ZPTC ఓట్లుగా గుర్తింపు

    MPTC, ZPTC బ్యాలెట్ పేపర్లను వేర్వేరుగా 25 చొప్పున కట్టలుగా ఏర్పాటు

    ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక్కో రౌండ్‌లో 1,000 బ్యాలెట్ పేపర్లు

    50 శాతం టేబుళ్లపై ZPTC ఓట్ల లెక్కింపు

    మిగిలిన 50 శాతం టేబుళ్లపై MPTC ఓట్ల లెక్కింపు

    ఒక MPTC లెక్కింపు పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి పరిశీలన, ఆమోదం

    ZPTC ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఫలితాల ప్రకటన

ఏపీ స్థానిక ఎన్నికల్లో మరో కీలక ఘట్టం ఇవాళ మొదలుకానుంది. కాసేపట్లో MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రతతోపాటు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్టు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది.

కౌంటింగ్‌ కోసం 9వేల 62 టేబుళ్లు ఏర్పాటు చేయగా… 11వేల మంది సూపర్‌వైజర్లు, 28వేల 692 మంది సహాయకులను నియమించారు. కౌంటింగ్ టేబుళ్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు చెరో 50 శాతం కేటాయించారు. ప్రతి రౌండ్‌లో వెయ్యి బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మొదట పోస్టల్ ఓట్లు… ఆ తర్వాత బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు

77 జెడ్పీటీసీలు, 2వేల 51 ఎంపీటీసీలు ఏకగ్రీవంకాగా… మిగిలిన 582 జెడ్పీటీసీ… 7వేల767 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైవున్న 21వేల 12మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. పరిషత్‌ ఎన్నికల్లో కోటీ 85లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పరిషత్‌ ఎన్నికల్లో 70.72శాతం పోలింగ్‌ నమోదైంది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 82.51శాతం… అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01శాతం ఓటింగ్‌ జరిగింది. MPTC ఎన్నికలకు గులాబీ రంగు పేపర్‌… ZPTC ఎన్నికలకు తెలుగు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగించారు. ముందుగా వీటిని వేరుచేసి కట్టలు కడతారు. అనంతరం, వెయ్యి చొప్పున ఓట్లను లెక్కిస్తారు.

కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 40వేల 679 మంది పోలీసులను మోహరించారు. బందోబస్తులో 135 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, 572 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,412 మంది ఎస్సైలు పాల్గొననున్నారు. సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు బాడీ వోర్న్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు.

ఎన్నికల ఫలితాలను ఇక్కడ చూడండి..


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us