Andhra Pradesh: ఏపీలో ముంచుకొస్తున్న మరో తుఫాన్..! ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. వాతావరణశాఖ తాజా వార్నింగ్..

ఏపీకి మరో తుఫాన్ ముంచుకొస్తుంది. ఇటీవల అర్నబ్ తుఫాన్‌తో రాష్ట్రం అతలాకుతలం అవ్వగా.. ఇప్పుుడు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడనుండగా.. ఇది తుఫాన్‌గా మారే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో ఏపీలో మరో తుఫాన్ ముప్పు ముంచుకొస్తుంది.

Andhra Pradesh: ఏపీలో ముంచుకొస్తున్న మరో తుఫాన్..! ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. వాతావరణశాఖ తాజా వార్నింగ్..
Cyclone Ap

Updated on: Oct 31, 2026 | 1:26 PM

ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 6 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంనది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇది మరింత బలపడి రేపు సాయంత్రానికి తుపానుగా మారే అవకాశముందని స్పష్టం చేసింది. సోమవారం సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని చేరుకునే అవకాశముందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా , రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల సమయంలో తీరం వెంబడి 45-65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని, లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

ఏపీలో ఇప్పటికే వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇటీవల అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో మరో భారీ కురవగా.. అల్పపీడనం ప్రభావంతో ఇప్పుడు మళ్లీ వానలు పడుతున్నారు. ప్రస్తుతం మరో తుఫాన్ ముప్పు క్రమంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. వరుస వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. భారీ వర్షాల సమయంలో ఇంట్లో తలదాచుకోవాలని, బయటకు రావొద్దని సూచించింది. ఇటీవల అర్నబ్ తుఫాన్ ఏపీలో అల్లకల్లోలం సృష్టించగా.. ఇప్పుడు మరో తుఫాన్ ముంచుకొస్తుంది.

రాష్ట్రంలో కేంద్ర బృందాలు పర్యటన చేపడుతున్నాయి. శని, ఆదివారాల్లో అర్నబ్ తుపాను నష్టాల్ని కేంద్ర బృందం పరిశీలించనుంది. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించనుంది. అలాగే సోమ, మంగళవారాల్లో ఖరీఫ్ – 2026 కరువు పరిస్థితులను పరిశీలించనుంది. పర్యటనల అనంతరం సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశం అయ్యే అవకాశముంది. ఆర్టీజీఎస్ నుంచి విపత్తుల నిర్వహణ విధానంపై కేంద్ర బృందం ఆసక్తి చూపింది. మ‌న‌మిత్ర గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. తుపాన్ స‌మ‌యంలో మ‌న‌మిత్ర ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి రియల్ టైంలో పరిష్కరించడాన్ని అభినందించింది. ఇది గుడ్ ఇన్షియేటివ్‌ అని, ఇత‌ర రాష్ట్రాలూ ఇలాంటి విధానం అమ‌లు చేయాల‌ని సూచించింది. అనినిత్యం ప్రజలకు హెచ్చరికలు పంపుతూ తుఫాన్ సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేశామని, దీని వల్ల ప్రాణష్టం జరగలేదని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us