Rain Alert: ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వానలకు ఛాన్స్ ఉందని ప్రకటన జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది.

Rain Alert: ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. వాతావరణశాఖ అప్డేట్ ఇదిగో..
Rains Ap And Telangana

Updated on: Oct 09, 2026 | 7:01 AM

బంగాళాఖాతంలో తీవ్ర ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు కురవనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ వల్ల ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ పరిస్థితుల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలుల సమయంలో వాహనదారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ చేసింది. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

కొన్ని జిల్లాలకు ఎల్లో.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

వాతావరణశాఖ ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించింది. వర్షాల క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఇప్పటికీ కనిపిస్తుంది. దీంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణకు రెయిన్ అలర్ట్

ఇక తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్, పిడుగుపాటు హెచ్చరికలు ఇచ్చింది. రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వార్నింగ్ జారీ చేసింది. సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. దీంతో వర్షాలు కురిసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద ఉండవద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

నైరుతి రుతుపవనాలు తిరోగమనం

అటు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు తిరోగమనం మొదలుపెట్టాయి. ఇవి క్రమక్రమంగా వెనుతిరుగుతున్నాయి. దీని ప్రభావంతో పలు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి.  ఈ సారి నైరుతి రుతుపవనాల వల్ల పెద్దగా వర్షాలు పడలేదు. సాాధారణ వర్షపాతంతో పోలిస్తే భారీగా తగ్గుముఖం పట్టింది. ఎల్‌నివో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు పంట సాగుకు దూరమయ్యారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలను కూడా ప్రకటించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us