
కడప జిల్లా వేంపల్లిలో YCP రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డిని జెడ్పీ స్కూల్ దగ్గర అడ్డుకున్న పోలీసులు.. అక్కడి నుంచి ఇంటికి తరలించారు.
ఎంపీ అవినాష్ ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. ఇటు వేంపల్లిలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు నిరసనకు దిగారు. పోలింగ్ కేంద్రంలోకి పంపడం లేదంటూ ఆందోళన చేపట్టారు.
ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడప జిల్లావ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజంపేట,వేంపల్లి, ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
APలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది
3804 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
బరిలో 10 వేల 295 మంది అభ్యర్థులు ఉన్నారు.
APలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్
4975 స్థానాలకు నోటిఫికేషన్ జారీ, 1095 స్థానాలు ఏకగ్రీవం
3804 సర్పంచ్ స్థానాలకు జరుగుతున్న పోలింగ్
బరిలో 10 వేల 295 మంది అభ్యర్థులు
ఇక వార్డుల విషయానికి వస్తే.. 49 వేల 318 స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది
19 వేల 655 వార్డులు ఏకగ్రీవమయ్యాయి
29 వేల 603 వార్డుల్లో పోలింగ్ జరుగుతుంది
63 వేల 395 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
83 లక్షల 52 వేల 338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం
మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్న పోలింగ్
రెండు గంటలకు ప్రారంభం కానున్న లెక్కింపు ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండో విడతలో 3 వేల 804 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 83 లక్షల 52 వేల 338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.
రెండో విడతలో మొత్తం 4,975 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పటికే.. 1,170 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,803 స్థానాల్లో 10,295 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మొత్తం 49,318 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. 19,655 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,603 స్థానాల్లో 63,395 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
రెండో విడత కోసం 50,476 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు 9,300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు.. 8,470 వెబ్‌కాస్టింగ్ గదుల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.