AP Panchayat Elections 2021 : చిత్తూరు జిల్లాలో ఊపందుకున్న ఏకగ్రీవాలు.. ఎక్కడెక్కడ అంటే..

|

Feb 09, 2021 | 12:55 AM

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. జిల్లాలో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి.

AP Panchayat Elections 2021 : చిత్తూరు జిల్లాలో ఊపందుకున్న ఏకగ్రీవాలు.. ఎక్కడెక్కడ అంటే..
Follow us on

AP Panchayat Elections 2021 : తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. జిల్లాలో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. రామచంద్రా పురం మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా… నారాయణవనం మండలంలోని 19 పంచాయితీలలోని ఐదు పంచాయతీల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు ఏకగ్రీవం అయ్యారు. ఇక పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలంలోని పది గ్రామ పంచాయితీలలో కూడా ఇదే తరహాలో ఏకగ్రీవాలు జరిగాయి. పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకుగాను 12 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AP Panchayat Elections 2021 : ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో నోటా కూడా.. : గోపాలకృష్ణ ద్వివేది

AP Panchayat Elections 2021 : ఆ పంచాయితీలో ఉంది కేవలం 667 మంది ఓటర్లే.. అది ఎక్కడంటే..