Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు కొత్త నిబంధనలు.. ఇదిగో ఇవే లేటెస్ట్ రూల్స్!

ఏపీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వాహణలో కీలక మార్పులు చేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు మున్సిపల్ చట్టాల సవరణపై మూడు కీలక జీవోలను విడుదల చేయడంతో పాటు, ఆగస్టు 28 నుంచి Act No.22 of 2026 ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు కొత్త నిబంధనలు.. ఇదిగో ఇవే లేటెస్ట్ రూల్స్!
Ap Municipal Elections

Updated on: Sep 05, 2026 | 7:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మున్సిపల్ చట్టాల సవరణకు సంబంధించి ప్రభుత్వం మూడు జీవోలను విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా Act No.22 of 2026 అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.

అలాగే మేయర్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఖరారు చేసింది. గతంలో మాదిరి బ్యాలట్‌ పేపర్లు కాకుండా ఇకపై మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగించనున్నట్టు స్పష్టం చేసింది. మేయర్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొంది. అంతేకాదు తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు నోటా NOTA వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.

అంతేకాదు డిప్యూటీ మేయర్ పదవి ఎంపికపై కూడా ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితి, నిబంధనలను నిర్దేశించింది. మున్సిపల్ కార్పొరేషన్ తొలి భేటీ జరిగిన 15 రోజుల్లోపే డిప్యూటీ మేయర్ ఎన్నికను పూర్తి చేయాలని.. ఎన్నిక జరగడానికి ఒక రోజు ముందే విప్ పత్రాన్ని సమర్పించాలని పేర్కొంది. విప్‌ను ధిక్కరించిన కౌన్సిలర్ల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేసింది.

ఒక వేళ ఎన్నికలో అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే, లాటరీ విధానం ద్వారా విజేతను ఎంపిక చేయాలని తెలిపింది. అదే డిప్యూటీ మేయర్ పదవి కనుక ఖాళీ అయితే, ఆ స్థానాన్ని 6 నెలల వ్యవధిలోగా తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Loading...
Unable to load recommendations.
Follow Us