AP: ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈనెల 29వరకు రిమాండ్‌ని పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. రెండు నెలల క్రితం అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. తన కారులోనే మృతదేహాన్ని తీసుకొచ్చారు ఎమ్మెల్సీ అనంతబాబు. రోడ్డు ప్రమాదంలో మరణించాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. కానీ, ప్రమాదం ఏం జరగలేదని విచారణలో తేలింది. అటు పొస్టుమార్టమ్‌లో ఇది కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్ అని తేలింది.
అప్పటి నుంచి అనంతబాబు రిమాండ్‌లోనే ఉన్నారు. పైగా ఎమ్మెల్సీ కుటుంబసభ్యులు.. డ్రైవర్ ఫ్యామిలీని బెదిరించడంతో బెయిల్ దొరికే చాన్స్ లేకుండా పోయింది. శుక్రవారం రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు హాజరైన అనంతబాబు ఖద్దరు చొక్కాతోనే కనిపించారు. పాత పొలిటీషియన్ తరహాలోనే కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు అనంతబాబు.
మే 23 నుంచి రిమాండులో ఉన్న అనంతబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటున్నారు. శుక్రవారం మరోసారి కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయనని సెంట్రల్ జైలుకు తరలించారు. జులై 29 వరకు ఆయన రిమాండ్‌ని పొడిగించింది కోర్టు. అయితే 29తర్వాతైనా ఆయనకు విముక్తి లభిస్తుందా లేదనే సందేహం అయితే ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం మాత్రం తమను బెదిరిస్తున్న అనంతబాబు తల్లి, అక్కపై ఫిర్యాదు చేశారు. తమను తిడుతున్నారని.. చంపుతామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షులు, బాధితులను బెదిరిస్తున్న కారణంగా కోర్టు బెయిల్ నిరాకరిస్తూ వస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి