స్థానికసమరం వేళ పరీక్షల పరేషాన్లు! అసెంబ్లీ లోపలా బైటా ఎడాపెడా ఎలిగేషన్లు

ఏపీలో మెగా డీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షలపై టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ పోరు ముదిరింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుండగా, గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌-1లో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అసెంబ్లీ వేదికగా ఇరుపక్షాలు పరస్పర విమర్శలు, సవాళ్లు విసురుకుంటున్నాయి.

స్థానికసమరం వేళ పరీక్షల పరేషాన్లు! అసెంబ్లీ లోపలా బైటా ఎడాపెడా ఎలిగేషన్లు
Ap Exam Politics

Updated on: Aug 20, 2026 | 9:55 PM

కూటమి వర్సెస్ వైసీపీ. డీఎస్‌సీ వర్సెస్ ఏపీపీఎస్‌సీ.. ఈ తగాదా ఐపోయినట్టే ఐపోయి మళ్లీ మొదలౌతోంది. ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లు, కొత్త వార్నింగులతో రక్తి కట్టిస్తోంది. మితిమీరి, నెత్తిని మండించి, నషాళానికంటుతోంది.. ఏపీలో పరీక్షల రాజకీయం. రాజమౌళి సినిమాకు మించి నడుస్తోంది టిట్‌ఫర్ టాట్ ఫైటింగ్ ఇక్కడ. గ్రూప్‌1 దొంగలు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని అసెంబ్లీలో సీఎం హెచ్చరిస్తే, మీ డీఎస్‌సీ నిర్వాకంపై సీబీఐ విచారణ కోసం ఢిల్లీ దాకా కొట్లాడతామని వీళ్లు కౌంటర్లతో కొడుతున్నారు. లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఏంటంటే, ఎగ్జామినేషన్ బీపీలు ఏపీ గల్లీల్ని దాటి ఢిల్లీకి చేరడం. కేంద్రంలో పెద్దల బుర్రలకు పని చెప్పడం. 17వ తేదీ సోమవారం వేదిక అసెంబ్లీ… డీఎస్‌సీలో జరిగాయంటున్న అక్రమాలపై నిజనిర్ధారణ. అంతా సక్రమం, పారదర్శకం.. అంటూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్. చర్చించడానికి ఎక్కడైనా రెడీ అని లోకేష్ ఛాలెంజ్. టార్గెట్ పేరు వైసీపీ చీఫ్ జగన్. 19వ తేదీ బుధవారం వేదిక అసెంబ్లీ.. ఈసారి బెత్తమెత్తుకుని, వాతలు పెడుతున్నది సీఎం చంద్రబాబు… సబ్జెక్ట్ ఏంటంటే- గతంలో జరిగిన గ్రూప్‌-1లో అక్రమాలపై సిట్ రిపోర్ట్. ఏటూజెడ్ చదివి వినిపించి అందరి లెక్కలూ తేలుస్తానని వార్నింగ్ ఇవ్వడం. ఇక్కడ టార్గెట్ పేరు జగన్ జమానా. 20వ తేదీ గురువారం వేదిక తాడేపల్లి...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి