Deputy CM Pawan Kalyan: మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు..

తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. వారిని అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి రుజువుచేశారు. భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన ఆ కేసుకు సంబంధించిన పురోగతిపై సీఐకి ఫోన్ చేసి ఆరాతీశారు. దీంతో కేసు ముందుకు సాగింది. ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏపీ పోలీసులు ఆ యువతి ఆచూకిని కునుగొనేందుకు శ్రమించారు.

Deputy CM Pawan Kalyan: మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు..
Deputy Cm Pawan Kalyan
Follow us

|

Updated on: Jul 03, 2024 | 6:52 AM

తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. వారిని అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి రుజువుచేశారు. భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన ఆ కేసుకు సంబంధించిన పురోగతిపై సీఐకి ఫోన్ చేసి ఆరాతీశారు. దీంతో కేసు ముందుకు సాగింది. ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏపీ పోలీసులు ఆ యువతి ఆచూకిని కునుగొనేందుకు శ్రమించారు. చివరకు జమ్మూలో ఉన్నట్లు ఆమె జాడను పోలీసులు కనిపెట్టారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం జమ్ము వెళ్లి యువతిని రాష్ట్రానికి తీసుకురావడంతో కథ సుఖాంతం అయ్యింది. గతంలో అనేక సభల్లో ఏపీలో 35వేల మందికిపైగా యువతులు అదృశ్యమయ్యారని చేసిన ఆరోపణలకు ఈ కేసు బలం చేకూర్చినట్లయిందని అంటున్నారు జనసేన పార్టీ నేతలు. గతంలో ఎన్నిసార్లు ఈ అంశంపై ప్రసంగించినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యిందని, దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ, మీరే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. తమ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఎదుట గుండెలవిసేలా విలపించారు. ఆ తల్లి రోదన విని చలించిన పవన్ కళ్యాణ్ తక్షణం ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాచవరం సీఐతోనూ, విజయవాడ పోలీస్ కమిషనర్‎తోనూ ఫోన్లో మాట్లాడారు. కేసుపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలని ఆదేశించారు. పోలీసులు అంతే వేగంగా కదిలారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక ఆచూకి కనుగొన్నారు. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన గాలింపు ఫలించి జమ్మూలో ఆ బాలిక ఉన్నట్టు తెలుసుకున్నారు.

ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం బాలికను తీసుకువస్తున్న విషయాన్ని విజయవాడ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‎కు మంగళవారం కాకినాడ కలెక్టరేట్‎లో అధికారులతో సమీక్షలో ఉండగా తెలిపారు. సమీక్ష మధ్యలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువతి ఆచూకీ కనుగొన్న పోలీసు శాఖకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేశారు. ఆడబిడ్డల అదృశ్యంపై కేసులు నమోదైతే అశ్రద్ద చేయవద్దని ఈ సందర్భంగా కోరారు. ప్రజలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయాలన్నారు. వాటిపై పోలీసులు తక్షణం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని మరోసారి పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ కూతురు ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా.. ఈ ఆహారాన్ని ట్రై చేయండి..
జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా.. ఈ ఆహారాన్ని ట్రై చేయండి..
హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ‌..
హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ‌..
తెరపైకి ప్రమాణాల పర్వం.. ఎన్నికలు ముగిసినా అక్కడ ఆరని జ్వాలలు..
తెరపైకి ప్రమాణాల పర్వం.. ఎన్నికలు ముగిసినా అక్కడ ఆరని జ్వాలలు..
రాత్రిపూట Wi-Fiని ఆన్‌లోనే ఉంచుతున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
రాత్రిపూట Wi-Fiని ఆన్‌లోనే ఉంచుతున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
డోలు బీట్‌కు స్టెప్పులేసిన రోహిత్.. జత కలిసిన కోహ్లీ, హార్దిక్..
డోలు బీట్‌కు స్టెప్పులేసిన రోహిత్.. జత కలిసిన కోహ్లీ, హార్దిక్..
బాప్‌రే.. కాకరకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనలా!
బాప్‌రే.. కాకరకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనలా!
ప్రభుత్వ ఆఫీసులలో టీవీ9 ఫ్యాక్ట్‌ చెక్‌..! ఎవరి ఇష్టం వారిదే..
ప్రభుత్వ ఆఫీసులలో టీవీ9 ఫ్యాక్ట్‌ చెక్‌..! ఎవరి ఇష్టం వారిదే..
దీపికా పదుకొనె కల్కి కంటే ముందే టాలీవుడ్‌లో సినిమా చేసిందా..!!
దీపికా పదుకొనె కల్కి కంటే ముందే టాలీవుడ్‌లో సినిమా చేసిందా..!!
ప్రకృతి ప్రేమికులా.. ఈ సీజన్‌లో ఈ ప్రదేశాన్ని సందర్శించండి..
ప్రకృతి ప్రేమికులా.. ఈ సీజన్‌లో ఈ ప్రదేశాన్ని సందర్శించండి..
అప్పుడు అండర్ డాగ్‌.. ఇప్పుడు ఆకాశమే హద్దు..
అప్పుడు అండర్ డాగ్‌.. ఇప్పుడు ఆకాశమే హద్దు..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..