Deepika Padukone: ఏంటీ..! దీపికా పదుకొనె కల్కి కంటే ముందే టాలీవుడ్‌లో సినిమా చేసిందా..!!

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న విడుదలై భారీ హిట్ సొంతం చేసుకుంది. మహాభారతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సైన్స్ ఫిక్షన్ ను మిక్స్ చేసి ఈ సినిమాను అద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కించాడు నాగీ. ఇక ఈ సినిమాలో లెజెండ్రీ యాక్టర్స్ ఉన్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. మొదటి సారి కమల్ హాసన్ నెగిటివ్ పాత్రలో కనిపించాడు.

Deepika Padukone: ఏంటీ..! దీపికా పదుకొనె కల్కి కంటే ముందే టాలీవుడ్‌లో సినిమా చేసిందా..!!
Deepika Padukone
Follow us

|

Updated on: Jul 05, 2024 | 9:29 AM

ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్కి గురించే మాట్లాడుకుంటున్నారు సినీ లవర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ కల్కి సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న విడుదలై భారీ హిట్ సొంతం చేసుకుంది. మహాభారతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సైన్స్ ఫిక్షన్ ను మిక్స్ చేసి ఈ సినిమాను అద్భుతమైన విజువల్ వండర్ గా తెరకెక్కించాడు నాగీ. ఇక ఈ సినిమాలో లెజెండ్రీ యాక్టర్స్ ఉన్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. మొదటి సారి కమల్ హాసన్ నెగిటివ్ పాత్రలో కనిపించాడు. అలాగే అమితాబ్ బచ్చన్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే చాలా మంది నటీనటులు ఈ సినిమాలో కనిపించి ఆకట్టుకున్నారు.

ఇక ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది దీపికా.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న దీపికా ఈ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే టాలీవుడ్ లో దీపికా చేసిన మొదటి సినిమా ఇది కాదు.. గతంలో టాలీవుడ్ లో సినిమా చేసింది దీపికా ఆ సినిమా ఎదో తెలుసా.?

టాలీవుడ్ సినిమాలో దీపికా పదుకొనె ఓ స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన లవ్ ఫర్ ఎవర్ అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో దీపికా కనిపించింది. ఈ సినిమాలో రణదీప్, మృదుల అనే కొత్త జంట నటించారు. జయంత్ సి పరాన్జీ బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో ఉన్న ఫ్రెండ్ షిప్ కొద్దీ దీపికా ఆ సాంగ్ చేసింది. కాకపోతే అప్పటికి దీపికా అంత ఫెమ్స్ కాకపోవడమతొ చాలా మందికి ఆ విషయం తెలియకుండా పోయింది. ఆ సినిమా కూడా అంతగా ఆడలేదు దాంతో దీపికా ను జనాలు మరిచిపోయారు. ఇలా కల్కి కంటే ముందే దీపికా టాలీవుడ్ లో మెరిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!