07 July 2024

మరో ప్రేమకథలో జాన్వీ.. మళ్లీ ఆ హీరో సరసన దేవర బ్యూటీ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతున్న జాన్వీ ఇప్పుడు తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం దేవరలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో రానున్న ఆర్సీ 16 చిత్రంలోనూ ఈ  బ్యూటీ ఎంపికైన సంగతి తెలిసిందే. 

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. మరోవైపు హిందీలోనూ వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. 

వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ మరోసారి ప్రేమికులుగా అలరించేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరు నటిస్తున్న సినిమా సన్నీ సంస్కారి కీ తులసీ కుమారీ. 

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు హీరో వరుణ్. 

ఈ సినిమాలో సాన్యా మల్హోత్రా కూడా నటిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మూవీ మేకర్స్. 

స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమాలో తులసి ప్రేమను దక్కించుకోవడానికి సన్నీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడో చూపించనున్నారు.