దురాలోచనతోనే ఓ స్టార్ హీరో నన్ను రూమ్ కి ఒంటరిగా రమ్మన్నాడు..: నటి ఇషా

Anil Kumar

07 July 2024

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై అనేక వార్తలు వినిపిస్తుంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పబ్లిక్ గా మాట్లాడారు.

అప్పట్లో మీటూ ఉద్యమం పేరుతో అనేక మంది సినీ తారలు తమకు ఎదురైన పరిస్థితులను, చేదు అనుభావాలను బయటపెట్టారు.

ఇప్పుడు అనేక ఇంటర్వ్యూలలో చాలామంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి పబ్లిక్ గానే మాట్లాడుతున్నారు.

ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇషా కొప్పికర్ కూడా తను ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్ గురించి చెప్పారు.

ఓ బాలీవుడ్ స్టార్ హీరో.. తన కెరీర్‌ బిగినింగ్‌లో అవకాశాలు కావాలంటే ఒంటరిగా వచ్చి తనని కలమని చెప్పాడని..

అప్పుడు తానుచాలా భయపడిపోయానని.. చెప్పారు. ఆ సమయంలో కొంచెం ఇబ్బంది కూడా పడ్డానని చెప్పుకొచ్చింది ఇషా.

ఆ టైం లో నిర్మాత ఏక్తా కపూర్ నేను కొంచం యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలని చెప్పింది” అంటూ చెప్పుకొచ్చింది.

నిత్య యవ్వనంతో ఎప్పుడు ట్రేండింగ్ లో ఉండే ఇషా.. ఇప్పుడు తన మాటలతో బీ టౌన్లో హాట్ టాపిక్ అవుతున్నారు.