Deputy CMs on Roja: రోజా వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎంలు.. కుటుంబం అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు తప్పవన్న మంత్రి

|

Jan 19, 2021 | 2:07 PM

రోజా ఎందుకు అలా మాట్లాడిందో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు. పదేళ్ల తర్వాత జగన్ కు దేశానికి ఏమవుతాడో మీరే చూస్తారని అన్నారు. బీజేపీ వాళ్ళు ఎన్ని యాత్రలు చేసినా..

Deputy CMs on Roja:  రోజా వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎంలు.. కుటుంబం అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు తప్పవన్న మంత్రి
Follow us on

Deputy CMs on Roja: ఏపీలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. అధికార పార్టీ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటుంటున్నాయి. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నగరి ఎమ్మెల్యే రోజా చేసిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. తనకు గ్రూపు రాజకీయాలు చేయడం చేతకాదని.. అందర్నీ కలుపుకుని వెళ్తానని చెప్పారు. తనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని.. రోజా ఎందుకు అలా మాట్లాడిందో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. తాను ప్రతి ఒక్కరికీ దండం పెట్టుకుని వెళ్ళేవాడిని.. తెలంగాణ, ఆంధ్ర లో జగన్ మోహన్ రెడ్డి సంఘాలు పెట్టుకుంటున్నారు.. పదేళ్ల తర్వాత జగన్ కు దేశానికి ఏమవుతాడో మీరే చూస్తారని అన్నారు. బీజేపీ  ఎన్ని యాత్రలు చేసినా జగన్ ఏపీకి 35ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు నారాయణ స్వామి.

రోజా ప్రోటోకాల్ వివాదంపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయని..  అవి నాయకుల మధ్య విభేదాలు అనుకోవద్దని చెప్పారు. అధికారులకు మాకు మధ్య ఎలాంటి వివాదం లేదు.. ఒకవేళ చిన్న చిన్న వివాదాలు ఉన్నా అవే సమసిపోతాయని చెప్పారు మంత్రి ధర్మాన.

Also Read: గ్రామంలో వింత ఆచారం.. సంక్రాంతి తర్వాత గొర్రెకు, పొట్టేలుకు ఘనంగా పెళ్లి..