AP DASCD Jobs: 5వ/7వ తరగతి/ఇంటర్‌ అర్హతతో వికలాంగులకు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ పరిధిలోని విజయనగరం జిల్లాలో.. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్‌మెన్, ధోబీ/ చెక్లర్/ స్వీపర్, ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి..

AP DASCD Jobs: 5వ/7వ తరగతి/ఇంటర్‌ అర్హతతో వికలాంగులకు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
AP DASCD Jobs

Updated on: Mar 30, 2023 | 1:32 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ పరిధిలోని విజయనగరం జిల్లాలో.. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్‌మెన్, ధోబీ/ చెక్లర్/ స్వీపర్, ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఐదో తరగతి/7వ తరగతి/ఇంటర్మీడియట్‌/డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దోబీ పోస్టులకు తెలుగు/ఉర్దూ/ఇంగ్లిష్/హిందీలో చదవడం, రాయడం తెలిసి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీనాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 10, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. అకడమిక్‌ మెరిట్‌, స్కి్‌ల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 3
  • ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 1
  • నైట్ వాచ్‌మెన్ పోస్టులు: 2
  • ధోబీ/ చెక్లర్/ స్వీపర్ పోస్టులు: 1
  • ఏఎన్‌ఎం పోస్టులు: 1

అడ్రస్..

సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్‌ నెం 34, కలెక్టర్‌ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్‌.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us