AP Corona Cases: ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 97,696 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 3797..

AP Corona Cases:  ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు  ఎన్నంటే.!
Coronavirus Cases In AP

Updated on: Jun 30, 2021 | 7:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 97,696 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 3797 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,86,618కి చేరింది. ఇందులో 38,338 యాక్టివ్ కేసులు ఉండగా.. 18,35,574 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 35 మంది ప్రాణాలు విడిచారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 12,706కు చేరుకుంది.

ఇక గడిచిన 24 గంటల్లో 5498 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 2,18,95,922 సాంపిల్స్‌ను పరీక్షించారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 165, చిత్తూరు 488, తూర్పుగోదావరి 874, గుంటూరు 306, కడప 230, కృష్ణా 182, కర్నూలు 117, నెల్లూరు 221, ప్రకాశం 350, శ్రీకాకుళం 110, విశాఖపట్నం 156, విజయనగరం 105, పశ్చిమ గోదావరి 493 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Also Read: 

ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!

Loading...
Unable to load recommendations.
Follow Us