AP Corona: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న కొత్తగా 1,002 కరోనా కేసులు..

AP Corona: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Coronavirus Cases In AP

Updated on: Aug 23, 2021 | 6:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న కొత్తగా 1,002 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20,03,342 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,508 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 19,75,448కి చేరింది. అలాగే తాజాగా వైరస్ కారణంగా 12 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 13,735కి చేరింది.

మరోవైపు నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 11, చిత్తూరు 113, తూర్పుగోదావరి 265, గుంటూరు 64, కడప 132, కృష్ణ 74, కర్నూలు 7, నెల్లూరు 118, ప్రకాశం 86, శ్రీకాకుళం 19, విశాఖపట్నం 54, విజయనగరం 35, పశ్చిమ గోదావరి 24 కేసులు నమోదయ్యాయి.

Follow Us