CM Jagan: సీఎం జగన్‌ కాన్వాయ్‌ను అడ్డుకోబోయిన హెడ్‌ కానిస్టేబుల్‌.. ఇంతకీ విషయమేమంటే..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కాన్వాయ్‌కి ఓ హెడ్‌కానిస్టేబుల్‌ అడ్డుపడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తాడేపల్లిలో మంగళవారం (మే 23) చోటుచేసుకుంది. నిన్న గుంటూరు వెళ్లిన సీఎం హెలికాప్టర్‌లో తిరిగి తాడేపల్లికి..

CM Jagan: సీఎం జగన్‌ కాన్వాయ్‌ను అడ్డుకోబోయిన హెడ్‌ కానిస్టేబుల్‌.. ఇంతకీ విషయమేమంటే..!
AP CM Jagan

Updated on: May 24, 2023 | 9:27 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కాన్వాయ్‌కి ఓ హెడ్‌కానిస్టేబుల్‌ అడ్డుపడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తాడేపల్లిలో మంగళవారం (మే 23) చోటుచేసుకుంది. నిన్న గుంటూరు వెళ్లిన సీఎం హెలికాప్టర్‌లో తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. ఈ క్రమంలో హెలిప్యాడ్‌ నుంచి సీఎం తన వాహనంలో నివాసానికి బయలుదేరారు.

ఇదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న సీఎం కాన్వాయ్‌కు హెడ్‌ కానిస్టేబుల్‌ అడ్డుపడే ప్రయత్నం చేశారు. విశాఖపట్నంకు చెందిన 16వ ఏపీఎస్పీ బెటాలియన్‌ బి-కంపెనీలో గార్డు-1 కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌గా పెద్దిరెడ్డి భాగ్యరాజుగా గుర్తించారు. ఇంతలో సీఎం భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ హెడ్‌కానిస్టేబుల్‌ని అదుపులోకి తీసుకున్నారు. పెద్దిరెడ్డి భాగ్యరాజు విశాఖలో పనిచేస్తుండగా.. తన భార్య విజయవాడలో విధులు నిర్వహిస్తోందని తెలిపాడు. తామిద్దరికీ ఒకే చోట పనిచేసేందుకు అవకాశమివ్వాలని సీఎంకు విన్నవించేందుకే ఇలా చేశానని విచారణలో తేలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us